టాలీవుడ్

సమంత ఇచ్చే షాక్ కు రెడీ గా ఉండండి

samantha-jfw-photo-shoot-still 4మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ‘మహానటి’ పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ పరిశ్రమల్లో అగ్రస్థాయి నటిగా వెలుగొందిన సావిత్రి జీవితంలోని అనేక విశేషాలతో రూపొందుతున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. అంతేగాక స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత ఎక్కువైంది. కాగా.. ఈ చిత్రంలో సమంత కూడా నటిస్తుంది. మొదట అందరూ సావిత్రి పాత్రలో సమంత నటిస్తుందని ఊహించారు. కానీ ఊహించని విధంగా ‘కీర్తి సురేష్’ సావిత్రి అని పోస్టర్ల ద్వారా తెలిసిపోయింది.

అలాగే ఈ చిత్రంలో సమంత ‘జమున’ పాత్రలో నటిస్తుందని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దాంతో ఎప్పటినుండో సమంత పాత్ర పై ఉన్న అనుమానాలు తొలగిపోయినట్లే. ఇక నిజ జీవితంలో జమున,సావిత్రి పోటా పోటీగా కెరీర్ లు నిర్మించుకున్నారు. దాంతో జమున పాత్ర తెరపై రెబెల్ గా కనపడుతుంది. కొన్ని సీన్స్ షాక్ ఇస్తాయని అంటున్నారు. జమునగా సమంత జీవిస్తోందని చెప్తున్నారు.

సావిత్రిగారిలా నటించడం ఛాలెంజింగ్‌గా ఉందని, ఈ పాత్రలో నటించడం అద్భుతమని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. సినిమాలో రియాలిటీ కోసం ఆమె చేసిన సినిమాలు ‘మాయాబజార్’ లాంటి వాటినుండి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. కథలో సావిత్రిగారి వయసు మారుతుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా మారుతూ ఉండాలి. ఈ సినిమా కోసం సుమారు 100 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తున్నాను. నా కెరీర్‌లో ఇదే ఇప్పటివరకూ ఛాలెంజింగ్ రోల్ అన్నారు.

వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, షాలిని పాండే, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే సంవత్సరం ఈ చిత్రం ప్రేక్క్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2