టాలీవుడ్

చైతూ, సమంత పెళ్లి ముహూర్తం, పెళ్లి ఖర్చు

 

Celebs at Woven Fashion Show chai sam 3మరి కొద్ది గంటల్లో నాగచైతన్య – సమంత ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో భార్యా , భర్తలు కానున్నారు. రాత్రి గోవాలో జరగనున్న ఈ పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులు, సమీప బంధువుల మాత్రమే హాజరవుతున్నారు. చైతూ హిందువు అవడంతో మొదటిరోజు హిందూ సంప్రదాయం ప్రకారం రాత్రి 11.52 నిమిషాలకు పెళ్ళి వేదమంత్రాల సాక్షిగా జరగనుంది. అక్టోబర్ 7న సాయంత్రం పొద్దుపోయాక క్రిష్టియన్ సంప్రదాయం ప్రకారం ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోనుంది.

చైతూ, సమంతలతో పాటు సన్నిహితులు కొందరు గోవా చేరుకొన్నారు. అక్కడి ‘డబ్ల్యూ’ అనే ఓ హోటెల్‌లో విడిది ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఉదయమే హైదరాబాద్‌ నుంచి గోవాకు రెండు ప్రత్యేక విమానాలు బయలుదేరి వెళ్లాయి. అందులోనే అక్కినేని, రామానాయుడు కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకకు వెళ్లారు.

ఈ రెండు వివాహ వేడుకలు పూర్తయ్యాక జరిగే రిసెప్షన్ వేడుకను అంగరంగ వైభవంగా వివిధ రంగాల ప్రముఖల మధ్య సెలబ్రేట్ చేసుకునేందుకు అక్కినేని కుటుంబం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. పెళ్లికి రూ. 10 కోట్లు ఖర్చుపెడుతున్నారు.

సమంతలో పెళ్లి హుషారు బాగానే కనిపిస్తోంది. నాగచైతన్యతో కలసి ఓ ఫొటోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘బ్రైడ్‌ వైబ్స్‌’ అని రాసి ఉన్న ఓ టీషర్ట్‌ ధరించి సమంత ఫొటోకి పోజు ఇచ్చింది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll