టాలీవుడ్

ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్టేషన్‌ : జవాన్ ట్రైలర్

‘యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా, వెనకోడు ఆగిపోయాడా, ముందోడు కూలిపోయాడా కాదురా.. యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం’ అని ధరమ్‌ చెప్తున్న డైలాగ్‌ తో ‘జవాన్’చిత్రం ట్రైలర్ వచ్చేసింది .మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ తాజా మూవీ ‘జవాన్’.రచయిత బీవీఎస్ రవి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్ర ట్రైలర్‌ గురువారం విడుదలైంది.

ట్రైలర్‌లో సీరియస్ డైలాగులతో పాటు… ధరమ్‌ తేజ్‌ను ఉద్దేశిస్తూ.. ‘బైకులెక్కి లవర్స్‌తో తిరగాల్సిన వయసులో అమ్మ ఇచ్చిన లిస్ట్‌ లేసుకుని తిరిగితే ఇదిగో ఇలానే ఉంటది..ఫ్రస్టేషన్‌’ వంటి సరదా డైలాగులు సైతం ఉన్నాయి.

ఆక్టోపస్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ని జవాన్‌గా ధరమ్‌తేజ్‌ ఎలా కాపాడతాడు కథ నేపథ్యంలో సినిమా ఉంటుంది అని హింట్ ఇచ్చారు. ఇందులో తమిళ నటుడు, నటి స్నేహ భర్త ప్రసన్న విలన్ పాత్రలో నటిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ…సినిమాలో దేశాన్ని ప్రేమించే యువకుడిగానే సాయిధరమ్ కనిపిస్తాడని, అది కేవలం దేశభక్తుడి పాత్రేనని ప్రకటించాడు. దేశం, కుటుంబం.. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలోనన్న సందిగ్ధత వచ్చినప్పుడు, దేశంవైపే మొగ్గు చూపే కుర్రాడి పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపిస్తాడని చెప్పాడు. ఇక, టైటిల్‌కు తగినట్టుగానే సినిమా ఉంటుందని, సాయిధరమ్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని పేర్కొన్నాడు. తమిళ నటుడు ప్రసన్న చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడని, అయితే.. రెగ్యులర్ విలన్ పాత్రల్లా కాకుండా అతడి పాత్ర నిండా కొత్తదనంతో ఉంటుందని వెల్లడించాడు డైరెక్టర్. ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా ఫేమ్ మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌.ఎస్‌ తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll