టాలీవుడ్

మళ్లీ అదే పని చేస్తున్న సాయి ధరమ్ తేజ,ఫ్యాన్స్ ఏమంటారో

Sai-Dharam-Tej-Stills-At-Sye-Raa-Narasimha-Reddy-Movie-First-Look-Laucnh-3సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన గత చిత్రాల్లో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ ‘గోలీమార్‌..’, ‘గువ్వ గోరింక’, ‘అందం హిందోళం’రీమేక్ లు సందడి చేశాయి.ఇప్పుడు 1990లో చిరంజీవి నటించిన ‘కొండవీటి దొంగ’ చిత్రంలోని ఓ సూపర్‌ హిట్‌ పాటను ధరమ్‌ తేజ్‌ చిత్రంలో రీమేక్‌ చేయనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘జవాన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు.

ఇందులో ‘చమకు చమకు ఛాం..’ పాటను రీమేక్‌ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో ధరమ్‌ తేజ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2018 ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. ధర్మా భాయ్, ఇంటిలిజెంట్ అనే టైటిల్స్ ఈ సినిమాకు పరిశీలనలో ఉన్నాయి.

లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఆకుల శివ కథ మాటలు అందించారు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ విజయం సాధించాలని కోరుకుందాం.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16