టాలీవుడ్

వినాయిక్ మాటే నెగ్గింది, టైటిల్ ప్రకటించారు

saiసుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి టైటిల్‌ని ‘ఇంటెలిజెంట్‌’కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రానికి ధర్మాభాయ్ అనే టైటిల్ పెట్టాలని సాయి ధరమ్ తేజ పట్టుపట్టారంటూ వార్తలు వచ్చాయి. వినాయిక్ మాత్రం ‘ఇంటెలిజెంట్‌’ టైటిల్ పెట్టాలని అన్నారని, చివరకు ఆయన మాటే ఫైనల్ అయ్యిందని చెప్తున్నారు.

నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన మస్కట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. జనవరి 17 వరకు టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. చిరంజీవిగారికి ‘ఖైదీ’ ఓ మెమరబుల్‌ మూవీగా నిలిచింది. అలాగే ‘ఇంటెలిజెంట్‌’ సాయిధరమ్‌కి ఓ ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవుతుందని” అన్నారు.

ఇక 1990లో చిరంజీవి నటించిన ‘కొండవీటి దొంగ’ చిత్రంలోని ఓ సూపర్‌ హిట్‌ పాటను ధరమ్‌ తేజ్‌ చిత్రంలో రీమేక్‌ చేయనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందులో ‘చమకు చమకు ఛాం..’ పాటను రీమేక్‌ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో ధరమ్‌ తేజ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2018 ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16