టాలీవుడ్

పద్మావతి మ్యాటర్….ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకు

 

padmavathi-mp-cmసంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి సినిమాపై కొన్ని హిందూ సంస్థలు, రాజ్‌పుత్ కులానికి చెందిన కొందరు నిరసనలకు దిగడంతో ఆ సినిమా నిర్మాతలు దాని విడుదలను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందం. ఈ నేపధ్యంలో ఈ రాజ్‌పుత్‌ రాణి ‘పద్మావతి’ చరిత్రను విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ పాఠ్యాంశాన్ని తీసుకొస్తామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు.

వచ్చే ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల్లో పద్మావతి ధైర్యసాహసాలు, ఆమె పేరు, ప్రఖ్యాతల గురించి తెలియజేస్తూ ఓ అధ్యాయాన్ని పొందుపరుస్తామని ఆయన వెల్లడించారు. ‘మహారాణి పద్మావతి జీవిత చరిత్ర గురించి ప్రజలెవరికీ తెలియడం లేదు. అందుకే పద్మావతి చరిత్రను తెలియజేసేలా ఓ అధ్యాయాన్ని తీసుకొస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న మధ్యప్రదేశ్‌ పాఠ్యపుస్తకాల్లో చిత్తోర్‌గఢ్‌ను అల్లాఉద్దీన్‌ ఖిల్జి ముట్టడించడం గురించి వరకు మాత్రమే ఉంది. అలా కాకుండా రాణి పద్మావతి గురించి ప్రత్యేక అధ్యాయాన్ని తీసుకురానున్నారు

అక్కడితో ఆగకుండా దీంతో పాటు రాణి పద్మావతి జ్ఞాపకార్థంగా స్మారకమందిరం నిర్మిస్తామని, ఆమె పేరు మీద అవార్డులు కూడా ఇస్తామని ప్రకటించారు.

ఈ చిత్రంపై మధ్యప్రదేశ్‌లో నిషేధం విధిస్తున్నట్లు సోమవారం సీఎం చౌహాన్‌ ప్రకటించారు. రాణి ‘పద్మావతి’ని కించపరిచేలా భన్సాలీ తెరకెక్కించారని అందుకే రాష్ట్రంలో చిత్రంపై నిషేధం విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll