టాలీవుడ్

ప్రభాస్‌ ని తెగ మెచ్చుకుంటూ ట్వీట్స్

neil-nitin-mukesh-to-play-a-villain-opposite-prabhas-in-saahoబాహుబలి ఘన విజయం తర్వాత ప్రభాస్‌ హీరోగా తెర‌కెక్కుతున్న స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘సాహో’. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం టీజర్‌నుఆ మధ్యన విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత సాహో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రంలో విలన్ గా చేస్తున్న నీల్ నితిన్ ముఖేష్ .. ప్రభాస్‌ నిజంగానే ‘డార్లింగే’ అనటం వార్త అయ్యింది. ఇటీవల ముఖేశ్‌ తన ప్రాతకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను పూర్తిచేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రభాస్‌తో కలిసి పనిచేస్తున్న అనుభవాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘ప్రభాస్‌ నిజంగా డార్లింగే. శ్రద్ధాకపూర్‌ కూడా అమేజింగ్‌. త్వరలో మీ ఇద్దరినీ సెట్‌లో చూడాలనుకుంటున్నాను. గాడ్‌ బ్లెస్‌’ అని ట్వీట్‌ చేశారు.

మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన కత్తిలో విలన్‌గా నటించిన నీల్‌ నితిన్‌ .. సల్మాన్‌ ఖాన్‌ ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’, ‘వాజిర్‌’ చిత్రాల్లోనూ ప్రతినాయక పాత్రల్లో కన్పించాడు. ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్‌గా తెరకెక్కించబోతున్నట్లు టీజర్‌ ద్వారా దర్శకుడు సుజిత్‌ చెప్పకనే చెప్పాడు. ఇప్పడు ప్రభాస్‌కు నీల్‌ నితిన్‌ లాంటి స్టైలిష్‌ విలన్‌ను ఎంపిక చేసి ఈ చిత్రం స్థాయిని మరోసారి చెప్పాడని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది. ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకుని అక్టోబర్‌ 23న టీజర్‌ విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

యువి క్రియేషన్స్‌ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి శంకర్‌ఎహసాన్‌ లాయ్‌ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll