టాలీవుడ్

‘సాహో’టీమ్ కీ తప్పలేదు, వేరే దారి లేదు

sahooసినిమారంగాన్ని పట్టిపీడిస్తున్న లీక్స్ సమస్యని అరికట్టడానికి ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా ఆగడం లేదు. పెద్ద సినిమాకు చెందిన లీక్స్ బయిటకు వస్తూనే ఉన్నాయి. ఏదో విధంగా లీక్స్ జరుగుతూనే ఉన్నాయి. దాదాదపు ప్రతి పెద్ద సినిమా నిర్మాతా తన సినిమా విడుదలకు ముందే ఈ విషయమైపై ఆందోళన చెందుతున్నాడు. అయితే… లీక్స్ ను కొంతవరకైనా ఆపేందుకు సాహో నిర్మాతలు ఓ ఆలోచన చేశారు. శంకర్ రోబో చిత్రం షూటింగ్ సమయంలో తీసుకునే జాగ్రత్తలే తమ సినిమాకూ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సాధారణంగా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అందుకి సంబంధించిన విజువల్స్, వీడియోలు బయటికి రావడం ముఖ్యంగా మొబైల్స్ వలనే జరుగుతుందని గమనించారు. ఈ విషయం గ్రహించిన సాహో నిర్మాతలు లీక్స్ ను అడ్డుకునేందుకు ఒక కండిషన్ పెట్టారు. సాహో షూటింగ్ స్పాట్ లో మొబైల్స్ ను అనుమతించడం లేదు. అలా చేసినందువల్లే హైదరాబాద్ షెడ్యూల్ కి సంబంధించి ఒక్క స్టిల్ కూడా బయటికి రాకుండా చూసుకోగలిగారు.

ఇక త్వరలో ‘అబుదాబీ’లో సాహో షూటింగ్ మేజర్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఇది చాలా కీలకమైన షెడ్యూల్ కావడంతో, లొకేషన్ కి ఎవరూ మొబైల్స్ తీసుకురావద్దని ముందుగానే చెప్పేశారట. సాహో మేకర్స్ తీసుకున్న ఈ జాగ్రత్త మంచి ఫలితాన్ని ఇవ్వడంతో మిగతా పెద్ద చిత్రాల నిర్మాతలు, దర్శకులు కూడా ఈ యాంగిల్ లో ఆలోచిస్తున్నారట.

ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్, మందిరా బేడీ వంటి పలువురు హిందీ నటులు ఇందులో నటిస్తున్నారు.

దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్‌ సన్నివేశాల కోసమే రూ.40 కోట్ల వరకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll