హాలీవుడ్

గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన మోడల్, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ekaterina Lisina hot 1ప్రపంచంలోనే అత్యంత పొడుగు కాళ్లు కలిగిన మహిళగా రష్యన్‌ మోడల్‌ ఎకటెరినా లిసినా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. ఆమె పొడవు 6.87 అడుగులు కాగా.. కాళ్ల పొడవు 52 అంగుళాలు. జూన్‌ 13న ఆమె కాళ్ల కొలతలు తీసుకున్న గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు అత్యంత పొడుగు కాళ్ల మహిళగా గుర్తించి ధ్రువపత్రం అందజేశారు. ఆమె వివరాలను తాజాగా 2018 ఏడాది ఎడిషన్‌లో పొందుపరిచారు.Ekaterina Lisina hot3

29 ఏళ్ల ఎకటెరినా రష్యాలో మోడలే గాక ప్రముఖ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి కూడా. 2008 ఒలింపిక్స్‌లో బాస్కెట్‌బాల్‌ క్రీడలో కాంస్య పతకం గెలిచిన రష్యా జట్టులో ఆమె సభ్యురాలు. రష్యన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించింది.Ekaterina Lisina hot4

తన కూతురు గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించడం పట్ల ఎకటెరినా తండ్రి విక్టర్‌ లిసిన్‌ మాట్లాడుతూ.. ‘నా కూతురు పుట్టినప్పుడే కాళ్లు చాలా పొడుగున్నాయి. ఆమె శరీరంతో పాటు అవి పెరుగుతూ వచ్చాయి. నేడు ఈ కాళ్లే నా కూతురికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి’ అన్నారు.Ekaterina Lisina hot5

‘నా కాళ్లే మోడల్‌ ప్రపంచంలో నాకు అవకాశాలు, గుర్తింపు తీసుకొచ్చాయి. చాలా మంది మోడళ్లు పొట్టిగా ఉండటంతో ఈ రంగంలో రాణించలేకపోతున్నారు. నాకు ఆ సమస్య లేదు’ అని ఎకటెరినా ఆనందం వ్యక్తం చేసింది.Ekaterina Lisina hot6

ఎకటెరినా లిసినా ఒకప్పుడు బాస్కెట్ బాల్ ప్లేయర్. ఒలింపిక్స్‌లో పాల్గొని తన ప్రతిభ నిరూపించుకుంది. 29 సంవత్సరాల ఈ యువతి ఆరడుగుల 9 అంగుళాలు. ఆమె పొడువే ఆమెను బాస్కెట్‌బాల్‌లో విజేతగా నిలిపింది. అంతేకాదు.. రష్యాలో అందరికంటే పొడువైన అమ్మాయి కూడా ఈమే.Ekaterina Lisina hot7

క్రీడాకారిణిగా తన శకం ముగిశాక లిసినా ఖాళీగా కూర్చోలేదు. మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. అక్కడ కూడా మెరుపులు మెరిపించి ప్రపంచంలోనే అత్యంత పొడువైన మోడల్‌గా రికార్డు సృష్టించింది. లిసినా మాత్రమే కాదు.. వాళ్ల కుటుంబీకులంతా పొడుగే. లిసినా తండ్రి ఆరడుగుల ఐదు అంగుళాలు, తల్లి ఆరడుగుల ఒక అంగుళం. 2008లో రష్యా తరుపున ఉమెన్స్ బాస్కెట్ టీమ్‌లో ఒలింపిక్స్ ఆడిన లిసినా ఆ దేశానికి కాంస్య పతకం సాధించి పెట్టింది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll