టాలీవుడ్

‘సాహో’ బిజినెస్ పై ఈ వార్త నమ్మవచ్చంటారా

sahooప్రభాస్‌ ‘బాహుబలి’ తర్వాత నటిస్తున్న ‘సాహో’ సినిమా ఎటువంటి బ్రేక్ లేకుండా కంటిన్యూగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. విదేశాల్లో యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రభాస్‌స్టైలిష్‌గా, ఇదివరకటి కంటే భిన్నంగా తెరపై సందడి చేస్తారని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘సాహో’ టీజర్‌ను ‘బాహుబలి 2’తోపాటు విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం విషయమై ఇప్పటికే చాలా వార్తలు,రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మరో వార్త వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆ వార్త ఏమిటంటే…‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రం కావడంతో ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడినట్లు సమాచారం. టీ-సిరీస్‌ ‘సాహో’ థియేట్రికల్‌ హక్కులకు భారీ మొత్తం ఆఫర్‌ చేసిందట. కానీ, నిర్మాతలు విక్రయించడానికి ముందుకు రాలేదట. సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ హక్కులకు మొత్తం రూ.240 కోట్లు ఆఫర్‌ చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. కానీ నిర్మాతలు రూ.270 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఆశించినట్లు తెలుస్తోంది.

యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ భారీ బడ్జెట్‌తో ‘సాహో’ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ నిపుణులు పనిచేస్తున్నారు. బాలీవుడ్‌ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, జాకీఫ్రాఫ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ ఇందులో ప్రభాస్‌ సరసన నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

. దీని తర్వాత కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ‘దందా’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించారట. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16