కోలీవుడ్

విశాల్ కు షాక్, డైరక్టర్ కు వార్నింగ్

Vishal-ఆర్కేనగర్‌ ఉపఎన్నిక మరో మలుపు తిరిగింది. తన నామినేషన్‌ను ఆమోదించారని సినీనటుడు విశాల్‌ అనుకున్న కొద్దిసేపటికే అతనికి షాక్‌ తగిలింది. విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వేలుస్వామి ప్రకటించారు. నామినేషన్‌ పత్రాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఈ ప్రకటన చేశారు.

నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం సాయంత్రం 300 మంది అనుచరులతో వచ్చిన విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కానీ నామినేషన్‌ అసంపూర్తిగా ఉందంటూ రిటర్నింగ్‌ అధికారి దాన్ని తిరస్కరించారు. దీంతో విశాల్‌ అందోళనకు దిగారు. తర్వాత ఆమోదం లభించిందని ట్విటర్‌ ద్వారా విశాల్‌ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఆయన నామినేషన్ను తిరస్కరిస్తున్నట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

అంతేకాకుండా సినీ దర్శక, నటుడు చేరన్‌ను నిర్మాతలమండలి అధ్యక్షుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్‌ హెచ్చరించారు. విశాల్‌ ఆర్కే.నగర్‌ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమై నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన నిర్మాతలమండలి అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ చేరన్‌ సోమవారం సాయంత్రం నుంచి స్థానిక ఫిలించాంబర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయం వద్ద పోరాటం చేసిన విషయం తెలిసిందే. విశాల్‌ నిర్మాతల మండలికి చేసిందేమీ లేదని, ఇప్పుడు ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేయడం సినీ నిర్మాతలు మరింత బాధింపు గురవుతారని ఆరోపణలు గుప్పించారు. చేరన్‌ ఆరోపణలకు స్పందించిన విశాల్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అందులో తాను నడిగర్‌సంఘం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇలాంటి ఆరోపణ వచ్చాయని, ఆ ఎన్నికల్లో గెలిచి, తమిళనిర్మాతల ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయని, ఇప్పుడు ఆర్కే.నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడూ అలాంటి ఆరోపణలే చేస్తున్నారని పేర్కొన్నారు. తాను చట్టపరంగా అన్ని విషయాలు చర్చించిన తరువాతే ఉప ఎన్నికల్లో పోటీకి నామినేషన్‌ దాఖలు చేశానని తెలిపారు. దర్శకుడు చేరన్‌ అంటే తనకు గౌరవం ఉందని, అయితే ఆయన నిరాధార ఆ రోపణలతో ఉచిత ప్రచారం పొందే ప్రయత్రం చేస్తున్నారని విమర్శించారు. తాను నిర్మాతల మండలి ఎన్ని కల్లో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. చేరన్‌ ఇలాంటి దుష్ప్రచారాలతో కాలం వృథా చేసుకోరాదని హితవు పలికారు. ఇతడు ఇప్పటికీ మారకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll