టాలీవుడ్

మీడియాలో రిచా పెళ్లి రచ్చ…అసలు నిజం ఇదీ

richa-gangopadhyayప్రభాస్ ‘మిర్చి’ లో హీరోయిన్ గా చేసిన రిచా గంగోపాధ్యాయ్‌ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని.. ఆమె పెళ్లాండింది మరెవరినో కాదని…అమెరికాలో తన చిన్ననాటి స్నేహితుడిని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తల్ని రిచా ఖండించారు. తనకు పెళ్లి కాలేదని, ఇప్పట్లో చేసుకోనని స్పష్టం చేశారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వార్తను తనే నేరుగా చెబుతానని అన్నారు. ఇలాంటి రూమర్స్ ని సృష్టించొద్దని కోరారు.

లీడర్ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయినా రిచా గంగోపాధ్యాయ్ , మొదటి సినిమా ప్లాప్ అయినా కానీ అమ్మడికి వరుస ఆఫర్స్ వచ్చి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి..ఆ తర్వాత ‘నాగవల్లి’, ‘మిరపకాయ్‌’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’, ‘భాయ్‌’ చిత్రాలతో మెప్పించారు. అదేవిధంగా రెండు తమిళ చిత్రాల్లో కూడా హీరోయిన్ పాత్ర పోషించారు. ధనుష్ , శింబు వంటి స్టార్ హీరోస్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది..కెరియర్ జోరుగా సాగుతున్న క్రమం లో సడెన్ గా సినిమాలకు బై బై.. చెప్పేసి అమెరికాకు వెళ్లిపోయింది.

నటనకు స్వస్తి పలికానని రిచా ఇటీవల ప్రకటించారు. ‘ఎవరైతే నా తర్వాతి సినిమా ఏంటని అడుగుతున్నారో వారందరికీ నేనిచ్చే సమాధానం ఇదే. నేను సినిమాలు వదిలేసి ఐదేళ్లు కావొస్తోంది. మీ ఫ్రెండ్‌ గూగుల్‌ ఉంది కదా. నేను ఇప్పుడు నా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. అందులో నటన అనే అంశమే లేదు.’ అని క్లారిటీ ఇచ్చారు రిచా. ‘లీడర్‌’ చిత్రంతో ఆమె నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll