బాలీవుడ్

డేరా బాబా అనుచరులు వర్మపై దాడి‌?

Dera-Baba-Biopic-By-RGV15 ఏళ్లనాటి అత్యాచార కేసులో 20 ఏళ్ల శిక్ష పడ్డ రాక్‌స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌..ఆయన గురించే ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతోంది. ఈ నేపధ్యంలో వర్మ దృష్టి కూడా ఆయనపై పడింది. ఆయన జీవితచరిత్రను సినిమాగా చేయాలని ఉత్సాహపడుతున్నట్లు సమాచారం.

తొలినుంచీ వివాదాస్పద సంఘటనలు, గ్యాంగ్‌స్టర్ల జీవిత చరిత్రలను వెండితెరపై చూపించడంలో రాంగోపాల్‌ వర్మది అందెవేసిన చెయ్యి. ‘రక్తచరిత్ర’, ‘సర్కార్‌’, ‘వీరప్పన్‌’, ‘వంగవీటి’ చిత్రాలు తెరకెక్కించిన ఆయన ఇప్పుడు అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ సింగ్‌పై బయోపిక్‌ తీసేందుకు యోచిస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ విషయం వార్తగా మీడియాలో రాగానే …ఇప్పటికి మిగిలి ఉన్న ఆయన భక్తులు వర్మపై మండిపడుతున్నారట. ఆయన సినిమా తీస్తారంటూ ఛాలెంజ్ లు విసిరుతున్నారట.

మరో ప్రక్క ఈ బయోపిక్ కోసం గుర్మీత్‌కు సంబంధించిన అన్ని విషయాలను వర్మ తెలుసుకుంటున్నారట. రీల్‌ లైఫ్‌ గుర్మీత్‌గా బాలీవుడ్‌ నటుడిని ఎంపిక చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్‌ టాక్‌. అయితే గుర్మీత్‌ బయోపిక్‌లో కేవలం ఆయన చేసిన తప్పులే కాకుండా మంచి విషయాలను కూడా చూపిస్తారట. త్వరలో ఈ విషయమై వర్మ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

డేరాసచ్చాసౌదా చీఫ్‌గా ఉన్న గుర్మీత్ రామ్ రహీమ్ స్వచ్చ సౌదాలో మూడో తరం వ్యక్తి….. డేరా స్వచ్చ సౌదాను స్థాపించిన బెలూచిస్తాన్‌ ప్రాంతానికి చెందిన మస్తానా బలూచిస్తానీని అనుచరులు పునీత బెపరవాహ్‌ మస్తానా జీ మహరాజ్‌ అని పిలుస్తారు. 1960 ఏప్రిల్‌ 18న ఆ‍యన చనిపోయాక షా సత్నాం స్వచ్చ సౌదా బాధ్యతలు స్వీకరించారు. మస్తానా నుంచి 41 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించిన షా సత్నాం 1990 వరకు ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించారు. 1991 డిసెంబర్‌ 13న ఆయన చనిపోయారు. ఆయన బతికుండగానే 1990 సెప్టెంబర్‌ 23న గుర్మీత్‌ రాం రహీమ్ సింగ్ డేరా చీఫ్‌ అయ్యారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll