టాలీవుడ్

టైటిల్ ప్రకటించి, వర్మ మళ్లీ కెలికే పోగ్రాం పెట్టుకున్నాడే

మహానటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఈ మూవీపై త‌న ఫేస్ బుక్ లో వివ‌రాలు ప్ర‌క‌టించాడు. వంగవీటి సినిమా తీసి బెజవాడలో అప్పటి రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మ.. తెలుగు రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసిన ఎన్టీఆర్‌పై సినిమా తీయనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వర్మ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

ఈ సినిమా తీయడానికి చేసిన పరిశోధన పూర్తయిందని, ఈ మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత.. లక్ష్మీపార్వతి చెప్పిన నిజానిజాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ బయోపిక్‌కు బదులుగా.. ఆయనను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసిన తెర వెనుక బాగోతాలను సినిమాగా తీయనున్నట్లు వర్మ తెలిపాడు. ఈ సినిమా తీయడానికి తానెంతో కుతూహలంగా ఉన్నట్లు చెప్పాడు.

ఈ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు రాంగోపాల్ వర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’లో నిజమని నమ్ముతున్న అబద్ధాల మాటున దాగిన నగ్న సత్యాలను, అసలుసిసలు వాస్తవాలను తెరకెక్కిస్తున్నట్లు వర్మ చెప్పాడు. ఎవరైతే ఎన్టీఆర్ కడుపుపై గుద్ది, వెన్నుపోటు పొడిచారో.. వారి గురించి అసలు నిజాలను బయటపెడతానని రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎన్టీఆర్ జీవితంలో నిజంగా ఏం జరిగిందో, మరీ ముఖ్యంగా ఆయన చివరి రోజుల్లో ఏం జరిగిందనే విషయంపై ఉంటుందని వర్మ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించాడు.

Comments

comments

Latest

Song

Promo

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll