గాసిప్స్

మెగా హీరోకు దిల్ రాజు మంచే చేసాడా..ముంచేసాడా?

dil raju sai dharam tejసినిమా రీషూట్ కు వెళ్లింది అంటే అప్పటివరకూ తీసిన అవుట్ పుట్ బాగోలేదని అర్దం. యాజటీజ్ అలా రిలీజ్ చేసేస్తే సినిమా దెబ్బ తినే పరిస్దితి ఉంటుందని భావిస్తే …తమకు నచ్చని భాగాలని రీషూట్ కు పంపుతూంటారు. అయితే రీషూట్ చేస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచుతారు దర్శక,నిర్మాతలు. రీషూట్ టాక్ స్ప్రెడ్ అయితే సినిమా బిజినెస్ ఇంపాక్ట్ చూపెడుతుందని అందరికీ భయమే. ఇప్పుడు అలాంటి పరిస్దితే సాయి ధరమ్ తేజ కొత్త సినిమా జవాన్ కు ఎదురైందని తెలుస్తోంది.

రీసెంట్ గా విన్నర్ మూవీ తో ఫ్లాఫ్ కొని తెచ్చుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్ ఎట్టి పరిస్దితుల్లోనూ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్దితుల్లో … బివిఎస్ రవి దర్శకత్వంలో జ‌వాన్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. రవి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన వాంటెడ్ చిత్రం ఘోరమైన ప్లాఫ్. అయినా సరే నమ్మి ఈ సినిమా డైరక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇలాంటి పరిస్దితుల్లో సినిమా టాక్ ఏ మాత్రం తేడా కొట్టినా మొత్తం డబ్బులు పోతాయి. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రీ షూట్ జరుపుకుంటోంది.

నిజానికి జవాన్ ఈ నెలలో విడుదల కావాలి. కానీ దిల్ రాజు ఈ సినిమా విడుదల వాయిదా వేయాల్సిందిగా సూచించడంతో సాయి అండ్ టీమ్ జవాన్ రిలీజ్ ని అక్టోబర్ కి పోస్ట్ పోన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇలా చేసిన దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కి మంచే చేశాడని అంటున్నారు సినీ జనాలు. కానీ ముంచేసాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే దాదాపు సింహా భాగం షూట్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ఎడిట్ కంటెంట్ ని చూసుకున్న చిత్ర బృందం కొన్ని కీలక మార్పులు చేయాలని భావించిందట. దీంతో ప్రస్తుతం జవాన్ లో ఉన్న కొన్ని కీలక సన్నివేశాలు రీ షూట్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఓ ప్రక్కన వివి వినాయిక్ సినిమా కోసం రెడీ అవుతున్న సాయి …కు ఈ రీ షూట్ కోసం డేట్స్ ఎడ్జెస్ట్ చేయటం చాలా కష్టంగా ఉందిట. రీషూట్ విషయం బయిటకు పొక్కటంతో …ఖచ్చితంగా తమ సినిమా బిజినెస్ పై దెబ్బ పడుతుందని నిర్మాత భయపడుతున్నారట. అదీ విషయం.

సాయిధరమ్‌ తేజ్‌, మెహరీన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జవాన్‌’. బి.వి.ఎస్‌. రవి దర్శకుడు. అరుణాచల్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తున్నారు.
ఈ చిత్రంలో మెహ‌రీన్ కౌర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. దేశ‌మా , కుటుంబ‌మా అనే వెరైటీ క‌థ‌తో రూపొందుతోంది. ఈ మూవీలో విలన్ పాత్రలో తమిళ నటుడు ప్రసన్న నటించనున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కోట శ్రీనివాస‌రావు కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం తేజూ కెరియ‌ర్ కి మంచి బూస్ట‌ప్ ఇస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

Comments

comments

Latest

Promo

song

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll