టాలీవుడ్

మీకూ అమ్మ, అక్క, చెల్లి ఉంటారు కదా

renu-desai-attacks-hospital-managements_b_0905161227పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రీసెంట్ గా తను మళ్లీ వివాహం చేసుకుంటే బాగుండును అనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ వర్గాల్లో , పవన్ అబిమానుల్లో ఓ రేంజిలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఆమెకు మద్దతు తెలిపితే, మరికొందరు మాత్రం రేణూదేశాయ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ఆమె మళ్లీ క్లారిఫికేషన్ ఇచ్చారు.

“నిన్న నేను పెట్టిన పోస్టులో నా మాజీ భర్త అభిమానుల గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మీడియా, కొందరు వ్యక్తులు కలసి కల్యాణ్ అభిమానులకు, నాకూ మధ్య గొడవ తెస్తున్నారు. నేను చాలా క్లియర్‌గా రాశాను. ఈ పోస్టు నా వ్యక్తిగత జీవితం గురించి కాదు. దేశ పౌరురాలిగా నా ఆలోచనను పంచుకున్నాను. మిమ్నల్ని ఒకటే కోరుకుంటున్నా.. మహిళలకు స్వేచ్ఛ, విద్య, ఆరోగ్యం గురించి పట్టించుకోండి..

మీ అందరికీ అమ్మ, అక్క, చెల్లి ఉన్నారు. ఇది నా కోసం కాదు. వాళ్ల కోసం చేయండి. చదువుకోవడానికి, పనిచేయడానికి, భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి వారికి భరోసా ఇవ్వండి. మీడియా చానల్స్ డ్రామాలు, అపార్థాలు కలిగించే బదులు తమ శక్తుని పాజిటివ్ అంశాల ప్రచారానికి వాడాలని కోరుకుంటున్నారు. మీ ఇళ్లల్లోని మహిళల కోసం పురుషులందరూ ఏకతాటిపైకి రావాలి. కృతజ్ఞతలు” అని పోస్టు పెట్టారు.

మీరు మళ్లీ చేసుకుంటే చచ్చినంత ఒట్టు అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌పై మాత్రమే తాను స్పందించానని, కానీ మీడియా మాత్రం పవన్ ఫ్యాన్ అని ప్రచారం చేస్తోందని రేణూదేశాయ్ అన్నారు. తన పోస్ట్‌లో ఎక్కడా పవన్ ఫ్యాన్ అని రాయలేదని కూడా ఆమె వివరణ ఇచ్చారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll