బాక్స్ ఆఫీస్

పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే ‘అజ్ఞాత‌వాసి’ రికార్డ్

Pawan Kalyan Trivikram PSPK25 Movie HD Working Stills
Pawan Kalyan Trivikram PSPK25 Movie HD Working Stills

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం ‘అజ్ఞాత‌వాసి’. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విడుదలకు మందే ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటికే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో రికార్డు సృస్టించిన అజ్ఞాతవాసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రం విడుదల కానన్ని స్క్రీన్‌లలో విడుదల కాబోతోంది. ఏకంగా 249 ప్రాంతాల్లో విడుదల కానుంది.

ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌, హీరోయిన్లుగా నట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని హారికా హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే హీరోయిన్లు కీర్తిసురేశ్‌‌, అను ఇమ్మాన్యుయేల్‌లు తమ పాత్రలకు డబ్బింగ్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్, పవన్ కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సంచలనాలు సృష్టించాయి. ముచ్చటగా మూడో చిత్రంతో వీరిద్దరూ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని అభిమానులు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్‌ ఫామ్‌, ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ దృష్ట్యా హ్యాట్రిక్‌ కొట్టడం ఈజీగానే కనిపిస్తోంది. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాట ‘బయటికొచ్చి చూస్తే’కు విశేష ఆదరణ లభించింది.

ఇదిలా ఉంటే.. వార‌ణాసి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్ డేట్ ఏమిటంటే.. ఇంకో 4 రోజుల ప్యాచ్ వ‌ర్క్‌, 20 శాతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయ‌ని తెలిసింది. అనిరుద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2