బాలీవుడ్

‘అజ్ఞాతవాసి’ ఆడియో రైట్స్ అంతా

Pawan Kalyan Trivikram PSPK25 Movie HD Working Stills

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కాశీలో జరగనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలైన చాలా రోజులే అవుతున్న ఇంకా టైటిల్‌ని ఖారారు చేయలేదు . అయితే సినిమా టైటిల్ కూడా అజ్ఞాతవాసి అని పెట్టే ఆలోచనలో వున్నాడు త్రివిక్రమ్. మరో ప్రక్క ఈ సినిమాపై తాజాగా ఓ వార్త తెగ ఆసక్తిరేపుతోంది.

అదేమిటంటే సినిమా ఆడియో రైట్స్ ను భారీ రేటుకు విక్రయించారట. ఓ టాప్ ఆడియో కంపెనీ ఏకంగా 2 కోట్ల రూపాయలను చెల్లించి పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. ఆడియో మార్కెట్ అంతగా లేని ఈ రోజుల్లో ఇది చాలా పెద్ద రికార్డ్ అనాల్సిందే. బాహుబలి సిరీస్ లో ఏ మూవీకి కూడా ఇంత మొత్తం ఆడియో రూపంలో దక్కలేదు. రీసెంట్ రిలీజ్ అయిన సింగిల్ కూడా సూపర్బ్ రెస్పాన్స్ రావటమే అందుకు కారణం అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో లో బాషా రేంజ్‌లో పవన్‌కు ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఓ భారీ ట్విస్ట్‌తో ఈ సినిమా సాగుతుందని టాక్? పైగా నిజంగా బాషా రేంజ్‌లో అయితే అది మెగా ఫ్యాన్స్‌కు పెద్ద పండగే అని చెప్పాలి. ఎందుకంటే బాషా సినిమా ఏ రేంజ్‌లో హిట్టో అందరికీ తెలుసు. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే జనవరి 10న విడుదల కానుంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll