టాలీవుడ్

నంది అవార్డ్ పై పోసాని ఎటాక్ అసలు కారణం ఇదా

Posani-Krishna-Murali-On-Nandi-Awardsసగటు మనిషి, అమ్మాయి కాపురం, అరుణకిరణం, అన్న, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, స్నేహితులు.. వంటి మహిళా సాధికారత ఉన్న గొప్ప సినిమాలు సుబ్బయ్యగారు తీస్తే.. ఇలాంటి రెండు గొప్ప సినిమాలైనా బి.ఎన్‌.రెడ్డి అవార్డు వచ్చినవాళ్లు తీశారా? సుబ్బయ్య ఆ అవార్డుకి పనికిరాడంటే ‘నేను అజ్ఞానిని. పిచ్చికుక్కలాగా ఏదో వాగేశా. క్షమించండి’ అంటా. ఈ డౌట్లు జనాలకి వచ్చాయి. అడిగారు కూడా అంటూ ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి.

అయితే బిఎన్ రెడ్డి అవార్డ్ వచ్చింది బోయపాటి శ్రీను కు కావటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. చాలా కాలం నుంచీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కు, పోసాని కు పడటం లేదు. దాంతో బోయపాటిపై పర్శనల్ గ్రెడ్జ్ ఉంది కాబట్టే పోసాని ఇలా మాట్లాడారని ఓ వర్గం అంటోంది. బోయపాటికి అవార్డ్ రావటమే ఆయన కోపానికి కారణం అంటున్నారు.

ఇక బయిట టాక్ ఏమిటంటే…బోయపాటి శ్రీను తెలుగుదేశం ప్రభుత్వానికి అందించిన సహకారం గురించి చెప్తున్నారు. ముఖ్యంగా… పుష్కరాల టైంలో చాలా కార్యక్రమాల్ని పర్యవేక్షించాడు బోయపాటి. ఇలా ప్రభుత్వానికి సహకారం అందించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అతడిని బి.ఎన్.రెడ్డి పురస్కారానికి ఎంపిక చేయాలన్న ఒత్తిళ్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో కమిటీ సభ్యుడైన అల్లు అరవింద్ కూడా చొరవ తీసుకున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. తన కొడుక్కి ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన బోయపాటిపై అరవింద్ కూడా అభిమానం ప్రదర్శించాడట.

అలాగే…పోసాని కంటిన్యూ చేస్తూ…చంద్రబాబుగారి స్టేట్‌మెంట్లు చూస్తే తెలుస్తోంది. ఈ నంది అవార్డులు మేం నిజాయితీగా ఇచ్చాం అని ఎక్కడా అనడం లేదు. ఇవి అలా చేసుంటే బాగుండేది. ఐఆర్‌వీసీ పద్ధతుల్లో ఇచ్చుంటే బాగుండేదేమో? అన్నారు. అంటే అర్థమేంటి? రచ్చ జరిగిందనేగా లోపల. మరో మంచి మాట కూడా అన్నారు. ఏముంది నంది అవార్డుల్లో.. జ్యూరీ సభ్యులు బాగా చూసుకుంటారని పెట్టాం. వాళ్లు ఇచ్చిందాన్ని మేం ఏం చేయగలం? అన్నారు. అంటే లోపం జరిగిందనేగా? అంటే చంద్రబాబు తప్పు ఒప్పుకున్నట్టేగా! అని అన్నారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll