టాలీవుడ్

ఫస్ట్ లుక్ తోనే మాస్ ని టచ్ చేసాడే

touch chesi chuduమాస్ ని టార్గెట్ చేస్తేనే మంచి వసూళ్లు ఉంటాయి. ఈ విషయం దర్శక,నిర్మాతలకు స్పష్టంగా తెలుసు. అందుకే తమ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్, టీజర్ అన్ని విషయాల్లోనూ మాస్ ని మెప్పించే ఎలిమెంట్స్ ని పెట్టుకుని ముందుకు వెళ్తూంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. తాజాగా మాస్‌మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టచ్‌ చేసి చూడు’ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.

ఇందులో బోల్తాపడిన కారు వద్ద రవితేజ కళ్లజోడు పెట్టుకుని స్టైల్‌గా నడిచొస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. మాస్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ పస్ట్ లుక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా, సీరత్‌ కపూర్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విక్రమ్‌ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. వక్కంత వంశీ కథను అందిస్తూండగా ఇద్దరు హీరోయిన్స్ సినిమాలో నిటిస్తున్నారు. రాశిఖన్నాను ఒక పాత్ర కోసం ఎంపిక చేస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని రవితేజ నిర్ణయించినట్లు సమాచారం. సంగీతం: ప్రీతమ్స్‌, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16