బాక్స్ ఆఫీస్

రేసు నుంచి తప్పుకున్న రవితేజ

Raviteja-Touch-Chesi-Choodu-Movie-Stills-2మాస్ మహారాజా’ రవితేజ హీరోగా ‘టచ్ చేసి చూడు’ పేరుతో ఓ భారీ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు.

రాశి ఖన్నా ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ సీరత్ కపూర్. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేసి ఈ సినిమాని 2018 జనవరి 13న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే సంక్రాంతి రేసులోంచి ఈ సినిమా తప్పుకున్నట్లే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఫిబ్రవరి 5 న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంగీతం : ప్రీతమ్స్ కథ : వక్కంతం వంశీ. స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్. మాటలు : శ్రీనివాస్ రెడ్డి. అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి, మల్లు ఎడిటింగ్ : గౌతం రాజు. ఆర్ట్: రమణ. కో డైరెక్టర్ : రాంబాబు.ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్. యాక్షన్ : పీటర్ హేన్స్. నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ. దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll