City ki entho mandhi manushulu vasthuntaru pothuntaru ..
chetlu locallll .. 😉
MASS MAHARAJA
Ravi tejఅ! #Awe
Thank you Ravi Anna @RaviTeja_offl https://t.co/XvhE7uJ69h— Nani (@NameisNani) December 30, 2017
”సిటీకి ఎంతో మంది మనుషులు వస్తుంటారు పోతుంటారు. చెట్లు లోకల్” అంటూ నాని ఓ క్యాప్షన్ ఇచ్చి…ఓ ఫొటో ని ట్వీట్ చేసారు హీరో నాని. ఆ క్యాప్షన్‌తో పాటు ”రవి అన్నకి కృతజ్ఞతలు” అని జోడించారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే…
నేచురల్ స్టార్ నాని.. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన చిత్రం ‘అ!’. భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా ఆ పాత్రల తాలుకూ ఫస్ట్ లుక్స్‌ని చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది. అంతేకాకుండా.. ఆ మధ్య తను వాయిస్ ఓవర్ ఇచ్చిన చేప పాత్ర ఫస్ట్ లుక్‌ని కూడా నాని విడుదల చేశారు. ఇక.. రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన చెట్టు తాలుకు ఫస్ట్ లుక్ విడుదల చేశారు నాని.
నిత్యా మీనన్, కాజల్, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో ఈ సినిమా తెరపైకి రానుంది.