బాలీవుడ్

మాజీ హీరోయిన్ పై కంప్లైంట్, పోలీసులే వెళ్లి తనిఖీ

rani-mukarji‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘సాథియా’ ‘బ్లాక్‌’ ‘ కభీ అల్విదా నా కెహనా’ లాంటి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు చేసిన బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాలన్నీ ఆమె గ్లామర్‌కు, నటనకు తార్కాణాలుగా నిలుస్తాయి. ఇప్పుడు ఆమె ఓ లీగల్ వివాదంలో ఇరుక్కున్నారు. అక్రమ నిర్మాణాల కేసులో గతంలోరిషికపూర్‌, అనుష్కశర్మలకు నోటీసులు పంపిన బీఎంసీ (బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌) తాజాగా నటి రాణీ ముఖర్జీకి నోటీసులు జారీ చేసింది.

రాణి నివసిస్తున్న జుహులోని కృష్ణారామ్‌ బంగ్లా ఆవరణలో అక్రమంగా మరో భవనం కడుతున్నారంటూ పలువురు సామాజికవేత్తలు బీఎంసీకి ఫిర్యాదు చేశారు. దాంతో గత వారం బీఎంసీ అధికారులు రాణి నివాసంలోతనిఖీలు నిర్వహించడానికి వెళ్లారు. కానీ రాణి వారిని ఇంటి లోపలికి రానివ్వలేదు. దాంతో ఆగస్ట్‌ 30న పోలీసుల ఆధ్వర్యంలో మరోసారి తనిఖీలు నిర్వహించబోతున్నట్లు రాణికి పంపిన నోటీసులో పేర్కొన్నారు.

రాణి ఉంటున్న ఇంటిని బాగు చేయించుకునేందుకు 2014లో బీఎంసీ అనుమతులు జారీ చేసింది. 2015 నవంబర్‌ కల్లా పూర్తిచేయాలని పేర్కొంది. కానీ 2017 వరకు ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉన్నందుకు బీఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇచ్చిన గడువుకల్లా నిర్మాణ పనులు పూర్తిచేయకుండా కొనసాగిస్తూనే ఉంటే వాటిపై అక్రమ నిర్మాణాలుగా పరిగణించి కేసు నమోదు చేయాల్సి ఉంటుందని బీఎంసీ హెచ్చరించింది.

కెరీర్ విషయానికి వస్తే.. కాలం రాణి ముఖర్జీ అవకాశాలను కరిగించినా, అభిమానుల్లో ఆమె ఇమేజ్‌ ను తగ్గించలేకపోయింది. మూడేళ్ల కిందట ‘మర్దానీ’ అనే సినిమాలో నటించిన రాణీ ముఖర్జీ..ఆ తర్వాత నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకుంది. వివాహం, కుటుంబ బాధ్యతలతో సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం మళ్లి తెరపైకి వచ్చేందుకు రాణీ సిద్ధమవుతోంది. ఇప్పుడు తను చేయబోయే సినిమా కూడా ‘మర్దానీ’ లాంటి సామాజిక కథాంశంతో ఉండాలని భావిస్తున్నారట. ప్రస్తుతం నచ్చిన స్క్రిప్టును ఎంచుకునే పనిలో ఉన్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది రాణీ ముఖర్జీ తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll