టాలీవుడ్

‘ఎంత సక్కగున్నావే’ లిరిక్స్ ఇవిగో

‘రంగస్థలం’ సినిమాలోని మొదటి పాట లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి..’ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. పాట లిరిక్స్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

“యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకెబిందెలాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..
సింత సెట్టు ఎక్కి సిగురు కోయబోతే చేతికందిన చందమామ లాగ ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
మల్లెపూల మధ్య ముద్దబంతి లాగా ఎంత సక్కగున్నావె ముత్తయిదువుల మెళ్లో పసుపు కొమ్ములాగ ఎంత సక్కగున్నావె
చుక్కలసీర కట్టుకున్న వెన్నెల లాగ ఎంత సక్కగున్నావె యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకెబిందెలాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..
సింత సెట్టు ఎక్కి సిగురు కోయబోతే చేతికందిన చందమామ లాగ ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
రెండు కాళ్ల సినుకువి నువ్వు..గుండె సెర్లో దూకేసినావు..అలల మూటలిప్పేసినావు ఎంత సక్కంగున్నావె..లచ్చిమి..ఎంత సక్కగున్నావె
మబ్బులేని మెరుపువు నువ్వు..నేలమీద నడిచేసినావు..నన్ను నింగి చేసేసినావు లచ్చిమీ ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
సెరకుముక్క నువ్వు కొరికి తింటా వుంటే ఎంత సక్కగున్నావె సెరకు గడకే తీపి రుసి తెలిపీసినావె..ఎంత సక్కగున్నావె
తిరునాళ్లలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగ ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
గాలి పల్లకిలో ఎంకి పాటలాగ, ఎంకిపాటలోని తెలుగు మాటలాగ ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
కడవ నువ్వు నడుమన బెట్టి, కట్టమీద నడిసొస్తా వుంటే సంద్రం నీ సంకెక్కినట్లు ఎంత సక్కగున్నావె..లచ్చిమీ ఎంత సక్కగున్నావె
కట్టెల మోపు తలకెత్తుకుని అడుగులోన అడుగేస్తా వుంటే, అడవి నీకు గొడుగట్టినట్లు ఎంత సక్కగున్నావె..లచ్చిమీ ఎంత సక్కగున్నావె
బురదసేనులోన వరి నాటువేస్తా వుంటే ఎంత సక్కగున్నావె భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్లు ఎంత సక్కగున్నావె
యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకెబిందెలాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..
సింత సెట్టు ఎక్కి సిగురు కోయబోతే చేతికందిన చందమామ లాగ ఎంత సక్కగున్నావె”

రామ్‌చరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ ‘చిట్టబాబు’గా సమంత ‘రామలక్ష్మి’గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ‘రామలక్ష్మి’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.

పాట విడుదలైన రెండు నిమిషాల్లోనే రెండు వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాదే ఈ పాట పాడటం విశేషం. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆది పినిశెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10