టాలీవుడ్

‘రంగస్థలం 1985’…ఓ వైరల్ న్యూస్

 

rangasthalamమెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం 1985’. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. బుల్లితెర బ్యూటీ అనసూయ ఓ ముఖ్య పోషిస్తోంది. ఈ చిత్రానికి సంభందించిన ఓ వైరల్ న్యూస్ ని అందిస్తున్నాం.

చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది. డిసెంబర్ 8న శుక్రవారం నాడు ఉదయం 5:30గంటలకు రంగస్థలం ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ అయ్యింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను తీసి ఇన్ని రోజులు మంచి హిట్స్ అందుకున్నాడు. కాని కొన్ని ప్రయోగాలు మాత్రం మెగా హీరోకి నిరాశను మిగిల్చాయి. ఎక్కువగా బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాలను అందుకున్నా కూడా ఒక నటుడికి ప్రయోగాత్మకమైన సినిమా తీస్తేనే సంతృప్తిగా ఉంటుంది. ప్రస్తుతం అదే అనుభూతిలో మునిగి తెలుస్తున్నది రామ్ చరణ్. తన స్టార్ ఇమేజ్ ని సైతం పక్కనపెట్టి ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు.

పూర్తిగా గోదావరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఏ సినిమాలో ఒకటో రెండో హైలెట్ గా చెప్పుకునే విషయాలు ఉంటాయి. కానీ సినిమా మొత్తం హైలెట్ అని గుర్తింపు తెచ్చుకునే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు రంగస్థలం సినిమాకు కూడా అదే గుర్తింపు లభిస్తోంది. ఇక సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు.

వీలైనంత త్వరగా ఫిబ్రవరి లోపు సినిమాను మొత్తం రెడీ చేసి ఫైనల్ గా మార్చ్ 16న సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll