బాలీవుడ్

పబ్లిసిటి కోసం కాకుండా ఈ హీరో… నిజంగానే చెత్తను క్లీన్ చేసాడు

Randeep Hooda Workout routine and Diet Plan2స్టార్స్ సామాజిక కార్యక్రమాలు చేస్తుండటం చూస్తూండటం చూస్తూంటాం. అయితే అవి ఎంత వరకూ పరిమితం అంటే…కేవలం ఫొటోలు దిగటం తోనే వాళ్లు సరిపెట్టుకుంటూంటారు. కానీ బాలీవుడ్‌ హీరో రణ్‌దీప్‌ హుడా తాను అలాంటివాడిని కాదు అని నిరూపించుకున్నారు.

ముంబయిలోని జుహూ బీచ్‌ను శుభ్రపరిచేందుకు సాయం చేశారు. ఓ ఎన్జీవో సంస్థతో కలిసి ఆయన బుధవారం బీచ్‌ తీరంలో ఉన్న చెత్తను తొలగించారు. వినాయక చవితి సందర్భంగా నెలకొల్పిన గణపతి ప్రతిమలను మంగళవారం నిమజ్జనం చేశారు. ఈ నేపథ్యంలో బీచ్‌ దగ్గర చెత్త బాగా పేరుకుపోయింది. దీన్ని శుభ్రం చేయడానికి వచ్చిన ఓ సంస్థకు రణ్‌దీప్‌ ఇలా సాయం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఓ పబ్లిక్‌ సెలబ్రిటీ అయి ఉండి.. సాధారణ వ్యక్తిలా ప్రవర్తించిన రణ్‌దీప్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గత వారం నటి దియా మీర్జా తన భర్తతో కలిసి బీచ్‌ను శుభ్రం చేశారు. బీచ్‌ను శుభ్రం చేసేందుకు ముందుకు రావాలని నటి సోనాక్షి సిన్హా రెండు రోజుల క్రితం అభిమానులకు పిలుపునిచ్చారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll