టాలీవుడ్

‘అజ్ఞాత‌వాసి’ సమస్యని రానా పరిష్కరించగలడా?

pawan-rana‘జ‌ల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని సొంతం చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్రముఖ దర్శకుడు త్రివిక్ర‌మ్.. క్రేజీ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌స్తున్న చిత్రం ‘అజ్ఞాత‌వాసి’. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ఈ సినిమా తెర‌పైకి రానున్న సంగ‌తి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా .. . ‘అజ్ఞాతవాసి’ సినిమా కథని ‘ది హెయిర్‌ అప్పారెంట్‌’(లార్గో వించ్) అనే ఓ ఫ్రెంచ్ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నాడు త్రివిక్రమ్‌ అని ప్రచారం మొదలైంది.

అయితే టీ సీరిస్ వాళ్లు భారతదేశంలోని అన్ని లాంగ్వేజ్ లకు కలిపి ‘ది హెయిర్‌ అప్పారెంట్‌’ కాపీ రైట్స్ సొంతం చేసుకున్నారట. దాంతో తెలుగులో ఈ చిత్రం కథని లిప్ట్ చేసారని నేషనల్ మీడియాలో సైతం వార్తలు రావటంతో కాపీ రైట్స్ ఇష్యూ పేరిట లీగల్ నోటీసులు పంపారని వార్త. ఇప్పుడు ఆ సమస్యను తీర్చటానికి దగ్గుపాటి రానా సీన్ లోకి దిగారని మరో వార్తలాంటి రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లోనూ వెబ్ మీడియాలోనూ మొదలైంది. రానాకు ..టీ సీరిస్ వారికి ఉన్న అనుబంధంతో ఆయన మాట్లాడి విషయం సెటిల్ చేయబోతున్నారట.

‘ది హెయిర్‌ అప్పారెంట్‌’చిత్రం‘లార్గో వించ్’ అనే సినిమా బెల్జియన్ కామిక్ నావెల్ ఆధారంగా తెరకెక్కింది. దాని కథలోకి వెళ్తే.. ఓ కోటీశ్వరుడి కొడుకైన లార్గో సీక్రెట్‌గా పెంచబడతాడు. అదికూడా తండ్రికి చాలా దూరంగా ఓ అజ్ఞాత ప్రదేశంలో అతని పెంపకం సాగుతుంది. కొన్ని సంవత్సరాల గడిచిన అనంతరం లార్గో తండ్రి శత్రవుల చేతిలో చంపబడతాడు. ఈ విషయం తెలుసుకున్న లార్గో.. తన తండ్రి రాజ్యాన్ని పాలిస్తూ, శత్రువుల పనిబడతాడు. ఈ సినిమా ట్విస్టులు, రొమాన్స్, యాక్షన్ సీన్లు అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయినా ఎందుకో ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకోలేకపోయింది. క్రిటిక్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసినా.. కమర్షియల్‌గా మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది.

ఇప్పుడిదే సినిమా ఆధారంగానే త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ స్టోరీని డెవలప్ చేశాడని అంటున్నారు. దానికీ ‘అజ్ఞాతవాసి’ కథకీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయని తెలుస్తోంది. తక్కువ కంటెంట్ తో ఉన్న కథనే.. తన మాటలతో సినిమా మొత్తాన్ని నడిపించి హిట్ కొట్టే త్రివిక్రమ్, ‘అజ్ఞాతవాసి’ సినిమా ని నిజంగానే కాపీ కొట్టాడా లేదా అన్నది సినిమా విడుదలయ్యేవరకి వేచి చూడాలి.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll