టాలీవుడ్

‘బాందేవ్‌’గా భళ్లాళదేవ … ఫస్ట్‌లుక్‌ ఇదే..!

బాహుబలి , ది ఘాజీ అటాక్ చిత్రాలతో బాలీవుడ్ లో మార్కెట్ సంపాదించుకున్న తెలుగు హీరో రానా. తాజాగా ఆయన హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హాథీ మేరే సాథీ’. 1971లో హిందీలో ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. నూతన సంవత్సరం‌ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రానా ఏనుగు తొండాన్ని పట్టుకుని నిలబడిన స్టిల్‌ ఆకట్టుకుంటోంది.

హిందీ చిత్రానికి తమిళ దర్శకుడు ఎం.ఎ తిరుముగమ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో అలనాటి బాలీవుడ్‌ నటులు రాజేశ్‌ ఖన్నా, తనూజ జంటగా నటించారు. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకొంది.

నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని ఇప్పుడు సోలొమాన్‌ తెరకెక్కించనున్నారు. ట్రినిటీ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో దీనిని తెరకెక్కించనున్నారు.

‘‘హాథీ మేరే సాథీ’ చిత్రంలో నటించబోతున్నాను. కంటెంట్‌ ఉన్న సినిమాల్లో నటించడం నాకిష్టం.. ఒక మనిషికి, ఏనుగుకి మధ్య ఉండే చక్కని రిలేషన్‌షిప్‌ నేపథ్యంలో సాగే కథ. ప్రభు సాల్మన్‌ కథ చెప్పేటప్పుడు నేచర్‌పై అతనికి ఉన్న ఇంట్రెస్ట్‌ తెలిసింది’’ అని పేర్కొన్నారు రానా.

2018 జనవరి నుంచి భారత్‌, థాయ్‌లాండ్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా వచ్చింది కాబట్టి, ఇప్పుడు తీయబోయే హిందీ రీమేక్‌కీ ఇదే టైటిల్‌ను పెట్టబోతున్నారు.

ప్రస్తుతం రానా ‘1945’ అనే చిత్రంలో నటిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రెజీనా కథానాయికగా నటిస్తోంది. మరోపక్క మలయాళంలో ‘రాజా మార్తాండ వర్మ’ అనే చారిత్రాత్మక సినిమాలోనూ రానా నటిస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll