టాలీవుడ్

గజదొంగ జీవిత చరిత్రలో..దగ్గుపాటి రానా

ranaఇప్పుడు బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. క్రీడాకారులు, శాస్త్రవేత్తలు వంటి ప్రేరణ పొందగలిగే వ్యక్తుల జీవిత చరిత్రలు అందరూ తెరకెక్కిస్తున్నారు. అయితే అందరిలా తాము ఎందుకు చేయాలనుకున్నారో ఏమో ఓ గజదొంగ జీవిత చరిత్రను తెరకెక్కించటానికి సన్నాలు చేస్తున్నారు నిర్మాత అనీల్ సుంకర అని తెలుస్తోంది.

1980ల కాలంలో స్టూవర్ట్ పురం టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ ఉండేవాడు. అతని మీద రకరకాల కథలు, కథనాలు వున్నాయి. దొంగ అనీ, గజదొంగ అనీ కొందరు..అదేమీ.., కాదు, రాబిన్ హుడ్ టైపు అనీ మరి కొందరు అంటారు. అయితే అతనిలో గజదొంగ యాంగిల్ కాకుండా రాబిన్ హుడ్ అనే యాంగిల్ ని హైలెట్ చేస్తూ ఈ కథని రెడీ చేసారట. అలాగే..నాగేశ్వరరావుని ఎన్ కౌంటర్ చేయడానికి అతడి ప్రియురాలిని పోలీసు అధికారి లోబరుచుకున్నారని చెప్తారు.

ఓ సినిమా కథకు కావాల్సిన ముడిసరుకు వుంది టైగర్ నాగేశ్వరరావు జీవితంలో కనిపించిట అనీల్ సుంకరకు. అందుకే ఆ స్క్రిప్ట్ తో ఒక సినిమా రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు లాంటి మాస్ క్యారెక్టర్ కు రానా అయితే బాగుంటారని ఆయన్ని ఎప్రోచ్ అయినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. పీరియాడికల్ సినిమా కాబట్టి కాస్త ఖర్చు వుంటుందని ఆచి,తూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఇక దొంగాట సినిమా చేసిన వంశీకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమాకు ప్లాన్ చేస్తోంది ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. ఆ మధ్య ఇదే సంస్థలో వంశీకృష్ణ కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమా చేసాడు రాజ్ తరుణ్ హీరోగా.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll