టాలీవుడ్

‘రంగస్థలం’ హార్డ్‌డిస్క్‌లో ఫుటేజ్ మాయం ?

rangasthalam poster 3 charanరామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. సుకుమార్‌ దర్శకుడు. సమంత హీరోయిన్. అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం పై ఓ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిత్రం రీషూట్ చేస్తున్నారని, అది రాజమండ్రిలో రేపటి నుంచి షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఈ రీషూట్ కు కారణం నిన్నటి వరకూ చిరంజీవి సలహానే అన్నారు. ఇప్పుడు మరో కారణం బయిటకు వచ్చింది.

ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి ‘రంగస్థలం’ షూటింగ్ దాదాపు కంప్లీట్ చేశాడు దర్శకుడు సుకుమార్. సాంగ్స్ మినహా సినిమాలోని కీలక సన్నివేశాలు చాలా వరకూ కంప్లీట్ అయ్యాయి. అయితే షూటింగ్ రష్‌కి సంబంధించిన హార్డ్ డిస్క్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడం వల్ల షూట్ చేసిన ఫుటేజ్ డిలీట్ అయ్యిందనే వార్త సినీ సర్కిల్‌లో హాట్ టాపిక్ మారింది. దీంతో షాక్‌కి గురైన చిత్ర యూనిట్ చేసేది లేక మళ్లీ రీ షూట్ రెడీ అయినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంతవరకూ నిజముందనేది తెలియటం లేదు. ఇదే నిజమైతే ఈ మూవీ రిలీజ్‌కు మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు.

ఇక ఈ బుధవారం నుంచి ఈ చిత్ర ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ఈ నెల 12వరకు చిత్రీకరణ కొనసాగనుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరగనున్నట్లు సమాచారం.

ఇందులో ప్రధానపాత్రలకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై చిత్రయూనిట్ దృష్టి పెట్టనుంది. పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చెర్రీ, సమంత, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వేసవి కానుకగా మార్చి 30న ‘రంగస్థలం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll