టాలీవుడ్

‘రంగస్దలం’ పై ఈ వార్త నిజమేనా..సుకుమార్ అలా చేయడే.?

charan-rangastalamరామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. సుకుమార్‌ దర్శకుడు. సమంత హీరోయిన్. అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం పై ఓ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిత్రం రీషూట్ చేస్తున్నారని, అది రాజమండ్రిలో రేపటి నుంచి షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఈ రీషూట్ కు కారణం చిరంజీవి సలహానే అంటున్నారు.

ప్రస్తుతం ‘సైరా’ మూవీ రెగ్యులర్ షూట్‌ పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి రీసెంట్ గా ‘రంగస్థలం’ రష్ చూశారట. ఇందులో కొన్ని సీన్‌లు మార్పు చేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారట చిరు.ముఖ్యంగా రాజమండ్రి సెట్ వేసి, హైదరాబాద్ లో తీసిన సీన్స్ నచ్చలేదట. ఇందులో సమంత, రామ్ చరణ్‌లతో పాటు మిగిలిన నటీనటులు డీ గ్లామర్ అంశాలు ఎక్కువగా వున్నాయని.. ఆ తరహా సీన్స్ వల్ల ప్రేక్షకులు బోర్ ఫీర్ అయ్యే ప్రమాదం ఉండటంతో వాటిని తగ్గించాలని సుకుమార్‌కి సూచన చేశారని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఈ మూవీ రిలీజ్‌కు మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు.

ఇక ఈ రోజు బుధవారం నుంచి ఈ చిత్ర ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ఈ నెల 12వరకు చిత్రీకరణ కొనసాగనుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరగనున్నట్లు సమాచారం.

ఇందులో ప్రధానపాత్రలకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై చిత్రయూనిట్ దృష్టి పెట్టనుంది. పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చెర్రీ, సమంత, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వేసవి కానుకగా మార్చి 30న ‘రంగస్థలం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16