టాలీవుడ్

అక్కినేని హీరోతో అనుకుంటే..రామ్ లాక్ చేసి షాక్ ఇచ్చాడే

Hello-Guru-Prema-Kosame-Movie-Launch-Stills-03నాగార్జున సూపర్ హిట్ చిత్రంలోని ‘నిర్ణయం’లోని ‘హలో గురూ ప్రేమకోసమే రోయ్‌ జీవితం..’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే కదా. ఆ పాటలోని లైన్ తీసుకుని ఆ మధ్యన అఖిల్ చిత్రానికి టైటిల్ గా పెడతారని వార్తలు వచ్చాయి. అయితే అంత పెద్ద టైటిల్ ఎందుకు అని హలో అని సింపుల్ గా తేల్చేసారు. సినిమా కూడా తేలిపోయింది. ఆ తర్వాత నాగచైతన్య చిత్రానికి ఆ టైటిల్ పెట్టే అవకాసం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ అవకాసం లేదు. ఎందుకంటే అదే టైటిల్ ని రామ్ తన కొత్త చిత్రానికి లాక్ చేసేసి ప్రకటించేసాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే….నేను లోకల్, సినిమా చూపిస్తమామా అంటూ వరస హిట్స్ తో దూసుకు పోతన్న నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రామ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రానికి ‘హలో గురు ప్రేమకోసమే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

. ఈ సందర్భంగా అతిథులు ఎర్నేని నవీన్‌, స్రవంతి రవికిశోర్‌ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. వంశీ పైడిపల్లి క్లాప్‌ కొట్టారు. అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా హరీశ్‌ శంకర్‌ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఇందులో రామ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది.

‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న రెండో చిత్రమిది. ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘నేను లోకల్‌’ వంటి హిట్‌ తర్వాత త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి. మార్చి 12 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నాడు. రచన: సాయికృష్ణ, కళ: సాహి సురేశ్‌, కూర్పు: కార్తీక్‌ శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ కె.చక్రవర్తి.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

ఏ మంత్రం వేసావె MAR 9
కిరాక్ పార్టీ MAR 16
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
నా పేరు సూర్య MAY 4
కాలా APR

Now Showing

మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2