టాలీవుడ్

పవన్ వల్లే వర్మ మళ్లీ మాట తప్పారు

rgv-pawanకొద్ది నెలల క్రితం అంటే మే 27 న ‘ఇకపై కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మాట్లాడుతాను.. ట్విటర్‌ నుంచి తప్పుకొంటున్నాను’ అంటూ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చివరి ట్వీట్‌ చేసి ట్విట్టర్ కు బై చెప్పారు. తన ట్విటర్‌ ఖాతా 27/5/2009లో పుట్టిందని, 27/5/2017లో మరణించిందని కూడా రాసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ట్విటర్‌లో ఎటువంటి ట్వీట్‌ చేయకుండా.. దానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇన్ని రోజులూ తన ఆలోచనలు,అభిప్రాయాలు కేవలం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వ్యక్తపరిచారు.అయితే ఆయన ట్విటర్లోకి మళ్లీ వచ్చారు. దీనికి కారణం .. పవన్‌కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమా అని చెబుతున్నారు వర్మ.

మళ్లీ రెండోసారి ట్విటర్‌లోకి వచ్చానని వర్మ ట్వీట్‌ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అందరికీ తన శైలిలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ‘ట్విటర్‌ అజ్ఞాతవాసంలోకి వెళ్లిన నేను పీకే (పవన్‌కల్యాణ్‌) ‘అజ్ఞాతవాసి’తో స్ఫూర్తి పొంది మళ్లీ వచ్చా’ అంటూ వర్మ మరో ట్వీట్‌ చేసి ఆశ్చర్యపరిచారు.

ఆ వెంటనే రజనీకాంత్‌ రాజకీయాల గురించి ప్రస్తావించారు. ‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించిన తీరు, ఆ క్షణం ఆయనలో కనిపించిన పవర్‌ను ఇప్పటి వరకు ఆయనలో ఎప్పుడూ చూడలేదు. నా అంచనా ప్రకారం తమిళనాడులోని ప్రతి ఒక్కరు ఆయనకే ఓటు వేస్తారు. ఆయనకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ పోటీ చేయాలి అనుకున్నా అది మూర్ఖత్వం అవుతుంది’ అని వర్మ అన్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll