టాలీవుడ్

తండ్రి పుట్టిన రోజుకి,చెర్రీ ఇస్తున్న గిప్ట్

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ లు స్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన పుట్టిన రోజు అంటే ఆయన అభిమానులకి పండగ రోజే మరి. అలాగే ఆయన కుమారుడు రామ్ చరణ్ సైతం ఆయన పుట్టిన రోజుకు ఓ చిన్న గిప్ట్ ఇవ్వదలచుకున్నారు. ఆ విషయాన్ని ఆయన ఫేస్ బుక్ లో షేర్ చేసారు.

నాన్నగారూ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీలాంటి కంప్లీట్ వ్యక్తికి ఓ ఫెరఫెక్ట్ గిప్ట్ ని ఎంపిక చేయటం చాలా కష్టం. అయినా నా తరపు నుంచి ఈ రోజు 12:25 కు ఓ గిప్ట్ ఇస్తున్నా అన్నారు. ఇంతకీ ఆ గిప్ట్ ఏమిటనేది మనకీ చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టారు.

ఇదిలా ఉంటే చిరంజీవి కి ఆయన కోడలు ఉపాసన సూపర్ డూపర్ గిఫ్ట్ ఇవ్వబోతోంది అని తెలుస్తోంది. ఈ పుట్టిన రోజు సందర్భంగా కామినేని ఉపాసన ఆయనకి ఒక గిఫ్ట్ ప్రామిస్ చేసారట.

చిరంజీవి తనకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి రామ్ చరణ్ అని, అతనితో పాటు కుటుంబాన్నంతటినీ ఎల్లవేళలా సంతోషంగా ఉంచడానికి తాను ప్రయత్నిస్తానని మామయ్యకు ప్రామిస్ చేసినట్లు ఉపాసన తెలిపారు.ఈ ప్రామిస్‌ను నిలుపుకోవడం ఒక అందమైన బాధ్యత అని ఆమె అన్నారు.

” చిరంజీవి అంటే నాకు చాలా నమ్మకం. నేను చేసే ప్రతీ పనిలో ఆయన సపోర్ట్ తో పాటు పొగడ్త ఉంటుంది. ఆ పని ఇంకా బాగా చెయ్యాలి అనే ఉత్సాహం ఆయన నుంచి నేను పొందుతూ ఉంటాను. ” అన్నారు ఆమె. అలాగే రామ్ చరణ్‌కి కూడా నాన్నంటే ఎంతో ప్రేమ అని, చిరంజీవి మాస్టర్ అయితే చరణ్ స్టార్ శిష్యుడని ఆమె పేర్కొన్నారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll