బాలీవుడ్

పదేళ్ల తర్వాత రిలీజ్…వెనక అసలు ఆలోచన ఏంటీ

chiruthaరామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఇతర భాషల్లోకి వెంటనే డబ్ అవుతూంటాయి. అందులో పెద్ద వింతేమీ లేదు. వాళ్లకు అక్కడ మినిమం మార్కెట్ ఉండటమే దానికి కారణం. అయితే ఎందుకనో కానీ రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత మాత్రం ఇప్పటికీ తమిళంలో రిలీజ్ కాలేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు అయిన సందర్బంగా ఈ సినిమాని తమిళంలో రిలీజ్ కు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్దలం సైతం తమిళంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాలో ఈ తొలి చిత్రం రిలీజ్ కు సిద్దం అవటం విశేషమే.

‘చిరుత’కి పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహించారు. 2007లో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ చిరుత’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు చరణ్. ఈ సినిమా 178 సెంటర్లలో 50రోజులు ఆడింది.ఈ చిత్రానికి చరణ్.. ఫిల్మ్ ఫేర్ బెస్ట్ సౌత్ డెబ్యటెన్ట్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో ఆయన నటించిన మగధీర సినిమా.. బక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి గాను చెర్రీ ఉత్తమ నటుడు కేటగిరిలో ఫిల్మ్ ఫేర్ అవార్డు , నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకున్నారు.

‘చిరుత’లో నేహాశర్మ, ప్రకాశ్‌రాజ్‌, అలి, ఆశిష్‌ విద్యార్థి, బ్రహ్మానందం తదితరులు నటించారు. మణిశర్మ సంగీతంలోని ఈ సినిమా పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి. శ్యామ్‌ కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రం దాదాపు పదేళ్ల తర్వాత తమిళంలోకి అనువాదం అవుతోంది. ఏఆర్‌కే రాజరాజా మాటలు రాస్తున్నారు.

పి.కె.స్టూడియోస్‌ బ్యానరుపై ఈ చిత్రం విడుదలవుతోంది. ‘సిరుతైవేట్టై’ అని పేరు పెట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా రామ్‌చరణ్‌ నటించిన ‘మగధీర’, ‘ఆరెంజ్‌’ వంటి పలు చిత్రాలు తమిళంలో అనువాదం అయ్యాయి. ఇప్పుడు ‘చిరుత’ను దుమ్ము దులిపి అనువాదం చేస్తుండటం విశేషం.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll