ద్విపాత్రాభినయ చిత్రాలు చేయటం మన హీరోలకు కొత్తేమీ కాదు. అయితే చేసిన ప్రతీ సారి ఆ కథనంలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. అదే పద్దతిలో రామ్ చరణ్ గతంలో నాయక్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసారు. మళ్లీ మరోసారి రెండు పాత్రల్లో కనపించటానికి రంగం రెడీ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న ప్రయోగాత్మక కథాంశం ‘రంగస్థలం’ తర్వాత సినిమా మాత్రం ఊరమాస్‌గా ఉండేలా చూసుకుంటున్నాడు. అందుకోసం .. బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రామ్ చరణ్ చేయబోతున్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని తెలుస్తోంది.
అంతేకాదు ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. అంతేకాదు గతంలో టాలీవుడ్లో చిరు హీరోగా వచ్చిన ‘రౌడీ అల్లుడు’ సినిమా, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘ప్రేమ్ రతన్ దన్ పాయో’ సినిమా ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తాయంటూ అంటున్నారు.
మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీనివాస్ ఈ సినిమాను రాజస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో యూనివర్శల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించబోతున్నాడట. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న బోయపాటి-చరణ్ సినిమాలో నటించే నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.