బాక్స్ ఆఫీస్

బాబాయ్ కోసం అబ్బాయ్ త్యాగం

pawan Charan_1644ఒకే కుటుంబం నుంచి రెండు సినిమాలు ఒకే సమయంలో వస్తే ఖచ్చితంగా ఇబ్బంది చాలా ఉంటుంది. అభిమానులు ఏ సినిమా చూడాలో అర్దం కాని సిట్యువేషన్ లో ఉంటారు. మెగా కుటుంబంలో అలాంటి సమస్య రాకుండా ఇన్నాళ్లూ జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ తను అడ్డం తప్పుకుని తన బాబాయ్ కు దారి ఇస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే వచ్చే సంక్రాంతి సీజన్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ ‘రంగస్థలం’ విడుదలను వాయిదా వేసుకున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

నిజానికి ‘రంగస్థలం’ చిత్రాన్ని సంక్రాంతికి సిద్ధం చేయాలని నిర్మాతలు భావించారు. ఈ మేరకు డిసెంబర్ మొదటి వారానికే తొలి కాపీని సిద్ధం చేసి ప్రమోషన్ పనులు ప్రారంభించాలని భావించారు. ఇక అదే సమయానికి తన బాబాయ్ చిత్రం కూడా విడుదల అవుతుండటంతో, పోటీ ఎందుకని భావించి ఫిబ్రవరి చివరి వారానికి చిత్రం విడుదలను వాయిదా వేసుకోవాలని రాంచరణ్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.

మరో ప్రక్క ‘రంగస్థలం’ షూటింగ్ కూడా దాదాపు ముగింపు దశకు రావడంతో, ఫిబ్రవరి వరకూ ‘సైరా’ నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకోవాలని చరణ్ భావిస్తున్నాడట.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll