టాలీవుడ్

ఎన్టీఆర్‌, చరణ్‌ల అమెరికా టూర్‌, అసలు కారణం ఇదే

ntr, ram2యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ లు ఇద్దరూ అమెరికా టూర్ కు బయిలు దేరారు. వీరిద్దరు కలిసి ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. అయితే హఠాత్తుగా వీరిద్దరూ కలిసి అమెరికా వెళ్లటానికి గల కారణమేంటి ఇది సిని అభిమానుల్లో పెద్ద ప్దశ్న. అయితే అందుతున్న సమాచారం మేరకు..వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీ స్టారర్‌ సినిమా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోయినా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.Ram Charan Ntr At Airport (1)

తాజాగా ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వీరిద్దరూ రాజమౌళి సినిమా పనిమీదే అమెరికా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ లాస్ ఏంజెల్స్ లో స్పెషల్ ఫొటో షూట్ జరుగుతుందని , హాలీవుడ్ కు చెందిన ప్రముఖ ఫొటో గ్రాఫర్ అక్కడ మేకప్ టీమ్ తో కలిసి స్పెషల్ గా కొన్ని ఫొటోలు డిజైన్ చేస్తారని తెలుస్తోంది. వీటిని సినిమా ప్రారంభం రోజున వదలనున్నట్లు సమాచారం. అంటే ఆ రోజు నుంచే ఈ సినిమాపై క్రేజ్ మొదలు కానుందన్నమాట.

ఇప్పటికే త్రివిక్రమ్‌ తో ఎన్టీఆర్‌, బోయపాటితో చరణ్ చేయాల్సిన సినిమాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాల షూటింగ్‌తో పాటు రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లోనూ భాగం పంచుకుంటున్నారు చరణ్, తారక్‌లు. రంగస్థలం షూటింగ్ ముగించుకున్న చరణ్‌ ఇంకా అదే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్‌ మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం స్లిమ్‌ అండ్‌ ఫిట్‌గా రెడీ అయిపోయాడు. ఈ రోజు ఉదయమే చరణ్, తారక్‌లు అమెరికా బయలుదేరి వెళ్లారు.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2