బాలీవుడ్

గ్రేట్…షూటింగ్ కు వెళ్లి 800 మరుగుదొడ్లు కట్టించాడు

rakeshభారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలపెట్టిన ‘స్వచ్ఛ భారత్‌’ క్యాంపెయిన్‌ నేపథ్యంలో ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే క్యాంపెయిన్‌ నేపథ్యంలో ‘మేరే ప్యారే ప్రైమ్‌ మినిస్టర్‌’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై మురికివాడలకి రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా వెళ్లారు. అప్పుడే అక్కడ ప్రజల కష్టాలను చూసి మెహ్రా మనసు చలించింది. వారి బాధలు తీర్చడానికి తన వంతుగా మరుగుదొడ్లు కట్టించడానికి ముందుకి వచ్చారుమురికి వాడల ప్రజల కోసం సొంత ఖర్చుతో 800 మరుగుదొడ్లు కట్టించాడు. కానీ ఎక్కడా ఈ విషయం చెప్పుకోలేదు. స్థానిక మీడియా ద్వారానే మెహ్రా చేస్తున్న సేవ బయటికి వచ్చింది. దర్శకుడు మెహ్రా గొప్ప మనస్సు తో హీరో మెహ్రా అయ్యాడని అంతా అభినందిస్తున్నారు.

కానీ ఎక్కడా దాని గురించి గొప్పగా ప్రచారం చేసుకోలేదు. అనుకోకుండా ఈ మధ్యనే ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆయన సేవాగుణాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. మరుగుదొడ్డి సౌఖర్యం లేక నిరుపేదలు పడుతున్న బాధలు చూసి ఆయన “మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్ “ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని చెప్పారు.

ఇక ఆదివారం వరల్డ్‌ టాయ్‌లెట్‌ డేను పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో టాయ్‌లెట్‌ బొమ్మ గీసున్న ఓ గోడ పక్కన ఓ తల్లి తన కుమారుడిని ఆప్యాయంగా పట్టుకున్నట్లుగా చూపిస్తూ ప్రతి ఇంట్లో టాయ్‌లెట్‌ తప్పనిసరిగా ఉండాలన్న సందేశాన్ని ఇస్తున్నట్లు ఉంది.

ముంబయికి చెందిన ఓ నలుగురు పేద విద్యార్థుల చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. వారిలో ఓ బాలుడు తన తల్లి కోసం టాయ్‌లెట్‌ నిర్మించాలనుకుంటాడు. ఈ విషయంలో ప్రధాని సాయం కోరుతూ ఆయనకి లేఖ రాస్తాడు. ఈ చిత్రంలో మరాఠీ నటి, జాతీయ అవార్డు గ్రహీత అంజలి పథక్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll