కోలీవుడ్

రజనీకోసం పెద్ద త్యాగమే చేసాడు..గ్రేట్

rajinikanth-kabali-movie-stills-20రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఇప్పటికే సంచలనంగా మారింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయపార్టీ నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. త్వరలో పార్టీ వివరాలు ప్రకటిస్తానని వెల్లడించారు. అయితే రజనీ పార్టీలో ఎవరు చేరబోతున్నారు అన్న విషయమై తమిళనాడులో ఉత్కంఠ నెలకొంది. లారెన్స్ లాంటి రజనీ అభిమానులు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించగా.. ఇప్పుడు మరో వ్యక్తి రజనీ తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యాడు. ఆయన మరెవరో కాదు.. ఇన్నాళ్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థకు క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేసిన రాజు మహాలింగం.

ఆయన తను పనిచేస్తున్న లైకాకు రాజీనామా చేసి రజనీ పొలిటికల్ పార్టీ కోసం పనిచేయనున్నట్టుగా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ రజనీ హీరోగా తెరకెక్కిస్తున్న ‘2 .ఓ’ సినిమాకు రాజు మహాలింగం పనిచేశారు. ఈ సినిమా సమయంలో రజనీ ఆలోచనలకు ఆకర్షితుడైన మహాలింగం రజనీతో కలిసి నడిచేందుకు అంగీకరించినట్లు చెప్పారు. లైకా వంటి ప్రొడక్షన్ కంపెనీని వదిలి రావటం ఇప్పుడు తమిళనాడు సిని,రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

మరో ప్రక్క అభిమానులను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు కొత్త వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. rajinimandram.org అన్న వెబ్‌సైట్‌ను రజనీ ప్రారంభించారు. అభిమానులెవరైనా ఆ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓటర్ ఐడీ నెంబర్ వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 234 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ వెల్లడించిన విషయం తెలిసిందే.

రజనీ కాంత్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రాజ్యం ఏలుతున్న పార్టీలు ప్రజలకు దోచుకుంటున్నాయి. నేనురాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మూడేళ్లలోనే రాజీనామా చేస్తాను. నేను ఏర్పాటు చేయబోయే పార్టీ నిజం, పని, అభివృద్ధి అనే మూడు మంత్రాలతో నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ చెడిపోయింది. తమిళనాడు రాష్ట్రం గురించి ఇతర రాష్ట్రాలు హేళన చేసి మాట్లాడుతున్నాయి. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం నేను ఇప్పుడు తీసుకోకపోతే పెద్ద తప్పు చేసినవాడినవుతాను. ప్రజాస్వామ్యం పేరిట కొందరు రాజకీయ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారు. రాజకీయాలు నాకు కొత్తేం కాదు. 1996లోనే నేను రాజకీయాల్లో ఉన్నాను’ అన్నారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16