టాలీవుడ్

‘రాజుగారి గది-2’ టాక్, హైలెట్స్, మైనస్ లు ఏంటి

rajugari-gadhi-2కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో తెరకెక్కిన తాజా చిత్రం రాజుగారి గది 2. మలయాళ చిత్రం ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఓంకార్ దర్శకుడు. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటించారు. రాజుగారి గదిలో హీరోగా నటించిన అశ్విన్ తో పాటు సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, షకలక శంకర్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు రిలీజైంది. సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రంపై తొలినుంచీ పాజిటవ్ బజ్ ఉంది. ఓం నమో వేంకటేశాయ సినిమాతో నిరాశపరిచిన నాగ్, ఈసినిమాతో సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు.

ఈ చిత్రం ఇప్పటికే చూసిన వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాజుగారి గది 2 ప్రారంభమే..దెయ్యంగా సమంత కొన్ని గ్లింప్సెస్ చూపుతూ ఎస్టాబ్లష్ చేయటంతో ప్రారంభం అవుతుంది. అదే సమయంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, ప్రవీణ్ లను ఎస్టాబ్లిష్ చేస్తుంది. వాళ్లు ఉన్న రిసార్ట్ లో ఓ దెయ్యం తిరుగుతోందని మెల్లిగా రివీల్ అవుతుంది. దాంతో మెంటలిస్ట్ రుద్ర (నాగార్జున) ని ఆ దెయ్యం సంగతి తేల్చమంటూ పిలుస్తారు. అక్కడ నుంచి ఇన్విస్టిగేషన్ ప్రారంభం అవుతుంది. దెయ్యంతో రుద్ర ముఖాముఖితో ఇంట్రవెల్ పడుతుంది.

సెకండాఫ్ లో అసలు ఆ దెయ్యం ఎవరు…ఎందుకు…వీళ్ల జీవితాల్లోకి తొంగి చూస్తోంది వంటి విషయాలు చుట్టూ సెకండాఫ్ రన్ అవుతుంది. ఈ విషయాలన్నీ నాగార్జున ఇన్విస్టిగేట్ చేస్తాడు. ఫైనల్ గా …ఇప్పుడు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఓ సమస్యతో ఈ కథను ముడిపెడుతూ ముగిస్తారు.

సినిమా ఎలా ఉందంటే ..ఫస్టాఫ్ కామెడీతో రన్ అయిపోయింది. అయితే రాజుగారి గది పార్ట్ 1 లో ఉన్నంత కామెడీ అయితే ఎక్సపెక్ట్ చేయలేం. కానీ విఎఫ్ ఎక్స్ తో కూడిన సీన్స్, రీరికార్డింగ్ చాలా బాగున్నాయి.

సెంకడాఫ్ కు వచ్చేసరికి…సినిమా ఎమోషనల్ గా సీరియస్ గా మారిపోయింది. ఫన్ లేదు. అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. మంచి హిట్ సినిమా మళ్లీ వచ్చినట్లే అని చూసిన వారు అంటున్నారు.నాగార్జున, సమంత పోటీ పడి నటించారని చెప్తున్నారు. కాస్సేపట్లో పూర్తి రివ్యూతో కలుద్దాం.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘రాజుగారి గది’ సినిమాకు మంచి స్పందన రావడంతో ‘రాజుగారి గది 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో నాగార్జున చాలా స్పెషల్ రోల్‌లో కనిపిస్తారని, అన్నారు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినమాలో ప్రవీణ్, షకలక శంకర్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll