కోలీవుడ్

2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన రజనీ

robo-2సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0’.ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వారికు ఆనందాన్ని ఇచ్చే వార్త ఇది. ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయంపై రజనీ తేల్చి చెప్పారు.

ముందుగా అనుకున్నట్లుగా జ‌న‌వ‌రి 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే విడుద‌ల తేది విష‌యంలో చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. తాజాగా.. చిత్ర హీరో ర‌జ‌నీకాంత్ ఈ విష‌యంపై స్పందించార‌ు. తమిళ న్యూఇయిర్ సందర్బంగా ఏప్రిల్ 13,2018న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు.. త‌న‌ని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన అభిమానుల‌తో ర‌జ‌నీ ఈ విష‌యం చెప్పార‌ని తెలిసింది.

మరో ప్రక్కఈ సినిమా టీజర్ ను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చెయ్యనున్నారు. ప్రముఖ సంగిత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆడియో వేడుకని ఇటీవల దుబాయ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రూ.450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ టెలివిజన్‌ శాటిలైట్‌ హక్కులు రూ.110 కోట్లు పలికినట్లు సమాచారం.

ప్రముఖ తమిళ దర్శకుడు శంక‌ర్.. సౌతిండియా సూపర్ స్టార్ ర‌జినీకాంత్.. వీరి కాంబినేషన్ సినిమా అంటే ..బ‌డ్జెట్ తో పాటు ర‌న్ టైమ్ కూడా పెరిగిపోతుంది. గతంలో వీరి కాంబోలో వ‌చ్చిన శివాజీ 3 గంట‌లు.. రోబో కూడా దాదాపు మూడు గంట‌ల నిడివితో వ‌చ్చాయి. ఈ రెండు సూప‌ర్ హిట్ అయ్యాయి. దాంతో శంక‌ర్ సినిమా అంటే క‌నీసం మూడు గంట‌లు ఫిక్సైపోయారు ప్రేక్ష‌కులు.

కానీ కాలం మారింది. మార్కెట్ విస్త-తి అయ్యింది. నేటి ప్రేక్షకులు ముఖ్యంగా అంతర్జాతీయ ప్రేక్షకులు అంత ఎక్కువ సమయం భరించలేరు అని నిర్ణయానికి వచ్చినట్లున్నారు శంకర్. అందుకే వీరి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం రన్ టైమ్ లో భారీగా కోత పెట్టేసారు.

తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2.0 సినిమా నిడివి సమయం మాత్రం కేవలం 140 నిముషాలు మాత్రమే ఉంటుందట. హాలీవుడ్ సినిమాలు కూడా 120 నిమిషాల లోపే ఉంటాయి, ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులను కూడా అలరించాలంటే వారి మార్కెట్ కు తగినట్లు ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేసాడంటున్నారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16