కోలీవుడ్

ఆ దేశంలో విడుదల కానున్న తొలి సినిమా 2.0

robo 2.0రజనీకాంత్ తాజా చిత్రం 2. 0కు మరో రికార్డ్ దక్కనుంది. పూర్తి ముస్లిం దేశమైన సౌదీ అరేబియా ఈ ఏడాది నుంచి సినిమా థియేటర్లను ఏర్పాటుచేయనున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ థియేటర్లు ఏర్పాటు చేశాక విడుదలయ్యే తొలి సినిమా మనదే. అదీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘2.0’కావటం విశేషం.

1980లలో సౌదీలో పెద్ద ఎత్తున ఇస్లామిక్‌ పునరుద్ధరణ ఉద్యమం జరిగినప్పుడు …సినిమాలు మత సిద్ధాంతాలకు విరుద్ధం అంటూ అక్కడ అన్ని థియేటర్లను మూసివేశారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత అక్కడ థియేటర్లను తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది సౌదీ ప్రభుత్వం. ఈ ఏడాది మార్చిలో తొలి సినిమా థియేటర్‌ను ప్రారంభించే అవకాశముందని సౌదీ మంత్రి ఒకరు తెలిపారు.

తమిళ న్యూఇయర్‌ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్‌ 14న విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో కలిపి దాదాపు 15 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0’.ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వారికు ఆనందాన్ని ఇచ్చే వార్త ఇది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll