టాలీవుడ్

సినిమా హిట్..రాజశేఖర్ ఏం చేస్తున్నాడో వీడియో చూడండి

హీరో రాజశేఖర్‌ సినిమాకు చాలా కాలం తర్వాత హిట్ టాక్ వచ్చింది. యంగ్ డైరక్టర్ ప్రవీణ్‌ సత్తారుతో కలిసి తీసిన చిత్రం ‘పి.ఎస్‌.వి. గరుడవేగ 126.18 ఎమ్‌’ కు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రివ్యూలు సైతం చాలా పాజిటివ్ గా వచ్చాయి. యూనిట్‌ సభ్యులు అందరూ కలిసి ఈ విజయాన్ని వేడుకగా జరుపుకొన్నారు. డ్యాన్స్‌లు వేసి సందడి చేశారు.

ఈ సందర్భంగా తీసిన వీడియోను శ్రద్ధాదాస్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రాజశేఖర్‌తో కలిసి డ్యాన్స్‌ చేసినట్లు పేర్కొన్నారు. దీనికి రాజశేఖర్‌ స్పందిస్తూ.. ‘మనందరికీ శుభాకాంక్షలు’ అని నవ్వుతూ ట్వీట్‌ చేశారు.

డ్రమ్స్‌ వాయిస్తుంటే రాజశేఖర్‌ చాలా ఉత్సాహంగా చిందేశారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, నిఖిల్‌, సందీప్‌కిషన్‌, నితిన్‌, సుధీర్‌బాబు, గోపీచంద్‌ మలినేని తదితరులు ట్విటర్‌ వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

రాజశేఖర్‌ సినీ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌ తో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించారు. పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

Comments

comments

Trailer

Latest

Recent

Coming Soon

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
లండన్ బాబులు

Now Showing

నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03
ఉన్నది ఒకటే జిందగీ OCT 27
రాజా ది గ్రేట్ OCT 18
రాజు గారి గది 2 OCT 13

Poll