గాసిప్స్

రాజమౌళి తర్వాతి చిత్రానికి హీరో ఎన్టీఆర్ కాదా? మరి ఎవరంటే

rajamouli ntr-team-up-for-garuda_b_1202160742‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా హీరో ఎవరన్న దానిపై టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోందని చెప్పాలి. అయితే, రాజమౌళి మాత్రం ఆచితూడి అడుగులు వేస్తున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ లేని చిత్రాన్ని తీసే ఆలోచన ఉందని గతంలో వెల్లడించిన రాజమౌళి.. ఆ చిత్రం ఏంటన్నది మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలో పలు వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

దర్శకుడిగా తన మొదటి చిత్రం ‘స్టూడెంట్ నంబర్ 1’ తో పాటు ఎన్టీఆర్ తో సింహాద్రి, యమదొంగ వంటి హిట్ చిత్రాలను రూపొందించిన రాజమౌళి, ‘బాహుబలి’ తరువాత మరోసారి ఎన్టీఆర్ తో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడన్న ప్రచారం ఆ మధ్యన టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారమయ్యింది. బాహుబలితో వచ్చిన క్రేజ్ తో జక్కన్నతో సినిమా చేసేందుకు ఎందరో హీరోలు రెడీగా ఉన్నప్పటికీ, ఆయన మాత్రం మరోసారి ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడని మీడియాలో కూడా గుప్పు మంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం…ఆ విషయం నిజం కాదని, రాజమౌళి తర్వాత చిత్రానికి హీరో ఎన్టీఆర్ కాదని తెలుస్తోంది.

తాజాగా మరో వార్త అటు చిత్ర పరిశ్రలోనూ, ఇటు సోషల్‌మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తోంది. రామ్‌చరణ్‌-రాజమౌళి కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతుందని అంటున్నారు.గతంలో రామ్‌చరణ్‌ హీరోగా రాజమౌళి ‘మగధీర’ను తెరకెక్కించారు. రామ్ చరణ్ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా ఆ చిత్రం నిలిచింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ చిత్రం చేయబోతున్నారన్న వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తారని అంటున్నారు. మరి ‘మగధీర’ కాంబినేషన్‌పై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ప్రస్తుతం రామ్‌చరణ్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నారు. సమంత కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న నవంబర్‌ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత చెర్రీ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll