టాలీవుడ్

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఫస్ట్ లుక్ , రాజమౌళి తో..

rajamouli-chiruమెగాస్టార్‌ చిరంజీవి 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’.రీసెంట్ గా ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఇక్కడో సర్పైజ్ ఉంది.

మంగళవారం(ఆగస్టు 22) చిరు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారట. ఇందులో రాజమౌళి ‘ఉయ్యాలవాడ’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు ఈ వేడుక ఆరంభం కానుంది. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌ దీనికి వేదిక కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా నయనతారను తీసుకోవడానికి చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll