టాలీవుడ్

రాజమౌళి ‘అ’ద్భుతం..’ అంటూ పొగిడేసాడు

తాజాగా నాని తొలిసారి నిర్మాతగా తెరకెక్కస్తున్న చిత్రం ‘అ’చిత్రం టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమా ట్రైలర్స్, టీజర్స్, సినిమాలపై తన అభిప్రాయం చెప్పే దర్శకుడు రాజమౌళి ఈ సినిమా టీజర్ చూసి స్పందించారు. ‘అ!’ సినిమా టీజర్ ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి నచ్చింది.

నిత్యామేనన్‌, రెజీనా, కాజల్‌, మురళీశర్మ, అవసరాల శ్రీనివాస్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నాని చేపకు, రవితేజ మొక్కకు వాయిస్‌ ఓవర్ ఇస్తున్నారు. గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. చాలా విభిన్నంగా ఈ టీజర్ రూపొందించారు. చేప(నాని), మొక్క(రవితేజ)కు మధ్య వచ్చే డైలాగులు జనాలకు నచ్చాయి.

దీన్ని చూసిన రాజమౌళి ట్విటర్‌లో స్పందించారు.‘ఫస్ట్‌లుక్‌ నుంచి ఇప్పుడు విడుదలైన టీజర్‌ వరకు అన్ని సినిమాపై ఆసక్తి రేకిత్తిస్తున్నాయి. ‘అ’ద్భుతం..’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీంతోపాటు సినిమా టీజర్‌ను అభిమానులతో షేర్‌ చేసుకున్నారు.

ప్రశాంత్‌ వర్మ ‘అ!’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్‌ పూర్తయింది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్లు నాని తెలిపారు. తెలుగు తెరపై ఇంతవరకు ఇలాంటి కథను ప్రేక్షకులు చూడలేదని చెప్పారు. కథ చాలా కొత్తగా అనిపించి, నిర్మాణ బాధ్యతల్ని కూడా స్వీకరించాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

టీజర్‌లో చేపకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్న నాని మాట్లాడుతూ..‘మీకొక కథ చెప్తా. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురూ నాలాంటి ఏడు అమాయక చేపల్ని పట్టుకున్నారు’ అని ఏడుస్తూ అంటాడు. ఇందుకు చెట్టుకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్న రవితేజ స్పందిస్తూ..‘నేను విత్తనంగా ఉన్నప్పటి నుంచి వింటున్నా. కొత్తగా ఏదన్నా చెప్పండ్రా’ అని అనడం నవ్విస్తోంది. రవితేజ ప్రశ్నకు నాని..‘కొత్తగా అంటే..ఈ టీజర్‌ చూడండి’ అంటాడు.

టీజర్‌లో నిత్యమేనన్‌, మురళీ శర్మ, ఈషా రెబ్బా, రెజీనా, అవసరాల శ్రీనివాస్‌ల పాత్రలను చూపించారు. అనంతరం టీజర్‌ గురించి రవితేజ స్పందిస్తూ..‘అదిరిపోయింది. ఇంతకీ హీరో ఎవరో..’ అని అడుగుతాడు. ఇందుకు నాని..‘కథే హీరో’ అంటాడు. నాని సమాధానం విని ‘అ!’ అంటాడు రవితేజ. ‘అదే టైటిల్‌’ అని నాని అనడం సినిమాలపై అంచనాలను పెంచేస్తోంది.

ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll