బాక్స్ ఆఫీస్

గ్రేట్ న్యూస్…”బాహుబలి” రెండు పార్ట్ లు కలిపి వదులుతున్నారు

baahubaliతెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన “బాహుబలి” మళ్ళీ త్వరలో మనను అలరించటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుగు సినీ వర్గాల సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సారి రెండు పార్ట్ లను కలిపి ఓ వెర్షన్ గా వదలనున్నారు. రెండు పార్ట్ లు కలిపితే ఐదు గంటలు ఉంటుంది. కథ చెడకుండా రెండు పార్ట్ లలోని ముఖ్యమైన ఎలిమెంట్స్ ని తీసుకుని ఓ వెర్షన్ గా మూడున్నర గంటల సినిమాగా వదలాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రాజమౌళి, నిర్మాతలకు కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇందుకోసం స్పెషల్ గా ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. అలాగే కొన్ని డిలేటెడ్ సీన్స్ ని కూడా ఈ రెండు పార్ట్ ల సినిమాలో కలపనున్నారు. అంటే బాహుబలి సినిమా లో ఇంతకు ముందు చూసిన హెలెట్స్ తో పాటు మనం చూడని సన్నివేశాలు కూడా చోటు చేసుకోనున్నాయన్నమాట. రీరిలీజ్ ని కూడా బారీగా రిలీజ్ ప్లాన్ చేయాలని నిర్ణయం. ఈ నేపథ్యంలో మరోసారి బాహుబలి మేనియా క్రియేట్ చేసేందుకు చిత్రయూనిట్ అన్ని రకాలుగా ప్రయత్నించాలని డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కరణ్ జోహార్ కూడా సై అన్నట్లు చెప్పుకుంటున్నారు. అంటే హిందీ వెర్షన్ సైతం వదలుతారన్నమాట.

ఇప్పటికే చాలా సార్లు టీవీలోనూ ఈ సినిమా ప్రసారమయ్యింది. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ లో అభిమానులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ లు కీలక పాత్రలో నటించిన బాహుబలి 1, 2 లాగానే ఈ సినిమా రెండు పార్ట్ లు కలిపిన వెర్షన్ కూడా అద్బుతం సృష్టిస్తుందేమో చూడాలి.

Comments

comments

Trailer

Promo

song

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll