గాసిప్స్

తన సినిమా కాకపోయినా మొత్తం రాజమౌళే చూసుకున్నాడట

రాజమౌళి వంటి ప్రతిభ ఉన్న దర్శకుడు ..టీమ్ వెనక ఉండి మొత్తం నడిపిస్తే ఎలాంటి సినిమాలు వస్తాయో మనందరికీ తెలిసిందే. అయితే ఆయన డైరక్ట్ చేసే సినిమాలకే ఆయన వెనక ఉండటం జరుగుతూంటుంది. అయితే తాజాగా నాగ చైతన్య సినిమాకు ఆయన మొత్తం బ్యాక్ ఉండి నడిపించినట్లు తెలిసిందే. ఆ సినిమా మరేదో కాదు ‘యుద్ధం శరణం’ . కథ ఎంపిక నుంచి చివరకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దాకా అంతా ఆయనే చూసారని, ముఖ్యంగా ట్రైలర్ కట్ చేసాక ఆయన ఇచ్చిన కొన్ని సూచలతో మళ్లీ మార్చారని ఇండస్ట్రీ టాక్. ఆయన ఇచ్చిన కొన్ని ఇన్ పుట్స్ తో ఈ చిత్రం తెరకెక్కిందని, నిర్మాత సాయి కొర్రిపాటితో ఆయనకు ఉన్న అనుబంధంతోనే ఇదంతా చేసారని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావటం కూడా రాజమౌళి ఇన్వాల్వమెంట్ కు కారణమైందని చెప్తున్నారు.

నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘యుద్దం శరణం’. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల అయ్యింది . ఈ చిత్రంలో శ్రీకాంత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. నాగచైతన్యకు జోడిగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి క్రిష్ణ ఆర్‌వి మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ”మ‌న జీవితాలు ఆనందంగా ఉన్న‌ప్పుడు ప్ర‌పంచం అంతా అద్భుతంగా ఉన్న‌ట్టే అనిపిస్తుంది” అనే నాగ‌చైత‌న్య డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

హ్యాపీగా సాగిపోతున్న ఓ కుటుంబంలోకి ఓ క్రిమిన‌ల్ అడుగుపెడితే.. వాళ్ల జీవితాలు ఎలా మారిపోయాయో.. ఈ సినిమాలో చూపిస్తున్నారు.

రాజమౌళి మాట్లాడుతూ ‘‘నాగచైతన్య కథల్ని ఎంపిక చేసుకొనే పద్ధతి నాకు నచ్చింది. సినిమా సినిమాకీ సంబంధం లేకుండా వైవిధ్యమైన కథల్ని ఎంచుకొంటున్నాడు. మా ఆవిడకు ఏ కథా ఓ పట్టాన నచ్చదు. నా సినిమాల్నీ విమర్శిస్తుంటుంది. అలాంటి తనకి ‘యుద్ధం శరణం’ కథ బాగా నచ్చింది. అప్పుడే అర్థమైంది.. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని. ఓ రోజు సెట్‌కి వెళ్లా.. అక్కడ ఓ కుటుంబం అంతా కలసి పండగ చేసుకొంటున్నట్టు అనిపించింది. శ్రీకాంత్‌ గెటప్‌ బాగుంది. ‘పరిగెడుతున్న ప్రతి ఒక్కడూ పారిపోతున్నట్టు కాదు’ అనే డైలాగ్‌ బాగా నచ్చింది. దాంతో ఈ సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. వివేక్‌ సాగర్‌ పాటలు ఆకట్టుకొన్నాయి. ఓ సామాన్యుడు హీరోగా ఎలా మారాడన్న నేపథ్యంలో తీస్తున్న కథ ఇది. తప్పకుండా మంచి విజయాన్ని అందుకొంటుంది’’అన్నారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll