టాలీవుడ్

‘రంగులరాట్నం’ట్రైలర్: ‘ఈ టార్చర్‌ నేను భరించలేను’

‘ప్రేమ పేరుతో నువ్వు పెట్టే ఈ టార్చర్‌ నేను భరించలేను’ అంటున్నాడు రాజ్ తరణ్. ఆ మాట అంటూనే తన లవర్ చుట్టూ తిరుగుతున్నారు . ఆమె కోసం తనకు ఇష్టం లేని పనులు చేస్తూ, ఇష్టమైన పనులకు దూరంగా ఉంటూ అనేక కష్టాలు పడుతున్నారు. ఇదంతా నిజ జీవితంలో అనుకుంటున్నారా..అబ్బే అదేం కాదండీ..రాజ్ తరణ్ తాజా చిత్రం రంగుల రాట్నంలోనివి. మీకిలా తెలుసు అంటారా..ఈ చిత్రం ట్రైలర్ రిలీజైంది.

రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘రంగులరాట్నం’. చిత్రా శుక్లా హీరోయిన్. శ్రీరంజని దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర ట్రైలర్ ను బుధవారం విడుదల చేసింది. ఎమోషన్స్ తోపాటు ఎంటర్టైన్మెంట్ కలగలిపి రూపొందించిన ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది.

ఈ చిత్ర నిర్మాత నాగార్జున ట్విటర్‌ వేదికగా ట్రైలర్ ని విడుదల చేశారు. జీవితం ‘రంగులరాట్నం’లా గుండ్రంగా తిరుగుతుందని ట్వీట్‌ చేశారు. ‘ఉయ్యాల జంపాల’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. ‘రంగుల రాట్నం’ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంభందించి ఇంతవరుకు ఎలాంటి పబ్లిసిటి చెయ్యలేదు. విడుదలకు 10 రోజులు ఉండడంతో ఈరోజు నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll